తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శనివారం రోజున ఉదయం జొన్న కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలుకు రూపాయలు 3371 మద్దతు ధరతో ఆదిలాబాద్ లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో . ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గుడిహత్నూర్ ద్వారా ఉదయం 9:15 నిమిషాలకు జొన్న కొనుగోల్లను ప్రారంభించనున్నట్లు జిల్లా మార్క్ఫెడ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయ శంకర్ బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, శాసనసభ మండల సభ్యులు (పట్టభద్రుల) ఎమ్మెల్సీ అంజిరెడ్డి, శాసనసభ మండలి సభ్యులు (టీచర్) మల్కా కొమురయ్య లు హాజరుకానున్నట్లు తెలిపారు. రైతులు తమ జొన్న పంటను దళారులకి మద్దతు ధర కంటే తక్కువ ధర కి అమ్మి నష్టపోకుండా రైతుల కి గ్రామాల వారీగా వ్యవసాయ అధికారులచే తేలిపబడిన షెడ్యూల్ ప్రకారమే తమకు సంబందించిన మార్కెట్ యార్డ్ కు తమ జొన్న పంటను ఎండలో ఆరా బెట్టించి తేమ శాతము 14% లోపల ఉండే విధముగా చేసి, చెత్త, చెదారామ్ లేకుండా శుబ్రపర్చి తమకు సంబంధించిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో తీస్కోవచ్చి అమ్మి మద్దతు ధర రూ., 3371/-క్వింటాలకి పొందవచ్చు.
జిల్లా రైతులు ఇట్టి విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకోగలరు.
Comments