26 బంతుల్లో సెంచరీ...24 సిక్సర్ లు కొట్టి ఉర్రూతలూగించిన చిచ్చర పిడుగు జైన్

Madupa Santhosh CEO
26 బంతుల్లో సెంచరీ.. 24 సిక్సర్లతో ఊచకోత చిచ్చర పిడుగు.జైన్
గేమ్స్ అండ్ స్పోర్ట్స్: అక్షరతెలంగాణ 
క్రీకెట్ చరిత్రలో సంచలనం సృష్టించిన 23 ఏళ్ల యువ బ్యాటర్ జైన్ నఖ్వీ ఇటు భారత్ లో ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఫీవర్ నడుస్తుండగానే యురోపియన్ క్రికెట్ లీగ్ లో ప్రతిష్టాత్మక ప్రదర్శన కనబరిచాడు.జైన్ నఖ్వీ మాత్రం 26 బంతుల్లో సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. ఈ సంచలన ప్రదర్శనతో జైన్ నఖ్వీ క్రికెట్ లో కొత్త తరం ఆడగల ఆటగాడిగా ఎదిగాడు.
జైన్ నఖ్వీ ఇటలీ జట్టు తరపున ఆడుతున్నాడు. ఇప్పటివరకు జైన్ నఖ్వీ 4 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో ఇటలీకి ప్రాతినిధ్యం వహించాడు. ఈ కాలంలో అతను 7 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఇప్పుడు అతని ఈ అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచం మొత్తం అతని పేరు గురించి మాట్లాడుకుంటోంది. 26 బంతుల్లో సెంచరీ సాధించడం, క్రికెట్ ప్రపంచంలో అతను అందుకున్న ప్రాధాన్యతను పటిష్టం చేస్తుంది. జైన్ నఖ్వీ విస్పోటనంతో అదరగొట్టాడు. ఐపీఎల్ 2025 సీజన్లోనూ అతనిపై అంచనాలు ఎక్కువగానే ఉండాయి. అయితే, అతని అద్భుత ప్రదర్శనకు సంబంధించిన విశేషం తన ఫోరములే కాదు, యూరోపియన్ టీ20 మ్యాచ్లో అతని మెరుపు బ్యాటింగ్ కూడా అతన్ని క్రికెట్ లో సంచలనాత్మక ఆటగాడిగా నిలిపింది. యూరోపియన్ టీ20లో టీమ్ సివిడేట్, మార్ఖర్ మిలానో జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో జైన్ నఖ్వీ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మార్ఖర్ మిలానో తరపున ఆడిన జైన్ నఖ్వీ చివరి ఓవర్లో 6 బంతుల్లో వరుసగా 6 సిక్సర్లు బాదాడు. ఈ సలివరీతో అతను చరిత్ర పుటల్లో తన పేరును నమోదు చేసుకున్నాడు.
జైన్ నఖ్వీ 26 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి మరొక సంచలనంగా మారాడు. తన సెంచరీ పూర్తయిన తర్వాత కూడా అతను బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 37 బంతుల్లో 160 పరుగులు సాధించి, జైన్ నఖ్వీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను ఈ ఇన్నింగ్స్ లో 24 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టాడు. జైన్ నఖ్వీ 432.43 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు.
మార్ఖర్ మిలానో జట్టు మొదట బ్యాటింగ్ చేసి జైన్ నఖ్వీ సెంచరీతో 2 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. జైన్ కాకుండా, అటా ఉల్లా 2 పరుగులు మాత్రమే చేశాడు, వాసల్ హుస్సేన్ 25 పరుగులు చేశాడు. 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో సివిడేట్ జట్టు 9 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. సివిడేట్ తరపున షాబాజ్ మసూద్ అత్యధికంగా 34 పరుగులు చేశాడు.
Comments