అసభ్యకరంగా ప్రవర్తించిన కీచక టీచర్ అరెస్ట్ : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Madupa Santhosh CEO
ADB: అసభ్యకరంగా ప్రవర్తించిన కిచక టీచర్ అరెస్ట్.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 
అదిలాబాద్ : అక్షరతెలంగాణ
 -పాఠశాల విద్యార్థినుల పట్ల, టీచర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, లైంగికంగా వేధించిన పిఈటి టీచర్.
 -షీ టీం ఫిర్యాదుతో ఒక కేసు మరియు టీచర్ ఫిర్యాదుతో ఒక కేసు, రెండు కేసులు మావల పోలీస్ స్టేషన్లో నమోదు.
 -పాఠశాల, కళాశాల  విద్యార్థులకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ ల పై అవగాహన కల్పిస్తున్నాం.
- మహిళలు, యువతులు, విద్యార్థినిలు అత్యవసర సమయాలలో ఆదిలాబాద్ షీ టీం బృందాన్ని సంప్రదించండి.ఆదిలాబాద్ షీ టీం నెంబర్ 8712659953.
ఆదిలాబాద్ జిల్లాలోని మావల పోలీస్ స్టేషన్ నందు ఈరోజు ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ మావల పాఠశాల నందు పిఈటిగా పనిచేస్తున్న టీచర్ పై రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేస్తూ మావల మండలం జడ్పిహెచ్ఎస్ పాఠశాల నందు పిఈటిగా విధులు నిర్వర్తిస్తున్న గుండి మహేష్ (54) తండ్రి శ్రీనివాస్, ఆదిలాబాద్ పట్టణం, పాఠశాల నందు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్న విషయాన్ని తెలుసుకొని, షీ టీం ఆదిలాబాద్ ఫిర్యాదు చేయగా మావల పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇతన్ని ఈరోజు అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఇతనిపై నమోదైన కేసు వివరాలు క్రైమ్ నెంబర్ 159/25 తో 12 ఆఫ్ ఫోక్సో సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఒక యోగ టీచర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వల్ల టీచర్ ఫిర్యాదుతో మరియొక కేసు నమోదు చేయడం జరిగిందని, కేసు వివరాలు క్రైమ్ నెంబర్ 158/25 తో సెక్షన్ 75 బిఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. రెండు కేసులలో విద్యార్థినుల పట్ల మరియు టీచర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, విద్యార్థుల మరియు యోగా టీచర్ శరీర భాగాలను మూడుతూ శారీరకంగా వేధించాడని బాధితులు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. విద్యాబుద్ధులను ఆటలను నేర్పవలసిన టీచర్ అసభ్యకరంగా ప్రవర్తించడం శారీరకంగా వేధించడం సభ్య సమాజానికి చెడ్డ పేరును తీసుకొస్తుందని జిల్లా ఎస్పీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా షీ టీం బృందాలను మరింత విస్తృతంగా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎలాంటి ఇబ్బందులు కలిగిన జిల్లాలోని మహిళలు యువతులు, విద్యార్థినిలు ఆదిలాబాద్ షీ టీం బృందాలను సంప్రదించాలని తెలియజేశారు. ఆదిలాబాద్ షీ టీమ్ బృందం ముఖ్యంగా విద్యార్థులకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ లపై అవగాహనాలను కల్పిస్తుందని తెలిపారు. ఎలాంటి అత్యవసర సమయంలోనైనా షీ టీం బృందాలను సంప్రదించాలంటే 8712659953 నంబర్ కు ఫోన్ ద్వారా సంప్రదించాలని తెలిపారు. అలాగే మద్యం సేవించి విధులకు రావడం జరుగుతుందని, ఇలాంటి ప్రవర్తన తో ప్రభుత్వం విధులు నిర్వహించే వారిపై సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తూ చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. అదేవిధంగా ఇతనిపై సంబంధిత శాఖకు శాఖపరమైన చర్యల నిమిత్తం సిఫార్సు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థినిలు తల్లిదండ్రులకు ఎలాంటి సమస్యలనైనా లైంగిక వేధింపుల పట్ల తెలిపినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాలని జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు..
Comments