' దేశీదారు ' మద్యం ను అక్రమంగా విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్..

Madupa Santhosh CEO

ADB:  ' దేశిదారు' మద్యం ను అక్రమంగా విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్ : సి ఐ డి. సాయినాథ్ జైనాథ్:అదిలాబాద్ : అక్షరతెలంగాణ 
భీంపూర్ మండలం అర్లి(టి)మందపల్లి గ్రామంలో దేశీదారు అమ్ముతున్నరన్న విశ్వసనీయ సమాచారం మేరకు జైనథ్ సిఐ డి.సాయినాథ్, ఏఎస్ఐ సిరాజ్ ,ముంతాజ్, కానిస్టేబుల్స్ మధుకర్, రవీందర్ లతో కలిసి మహారాష్ట్ర మాండ్వీ నుండి అక్రమంగా దేశీదారు తీసుకు వస్తున్న ఆత్రం లక్ష్మణ్, ఆశిష్ జైష్వాల్, కుంబెకర్ ప్రభాకర్, ఆత్రం కృష్ణ లను అదుపులో తీసుకొని వారి వద్ద నుండి 196 దేశిధారు బాటిల్లను సీజ్ చేయడం జరిగింది. వారిపై పలు సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలలో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు చేపట్టవద్దని , జిల్లాలో ఎక్కడ దేశిధారు ,పేకాట,మట్కా, గుట్కా, గంజాయి వంటి అసాంఘిక కార్యక్రమాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని,  అట్టి వారిపై ఉక్కుపాదం మోపాలని అదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచనల మేరకు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో నిఘా పటిష్టం చేసినట్లు డిఎస్పి ఎల్.జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతూనట్లు జైనధ్ సిఐ డి.సాయినాథ్ తెలిపారు.  దేశిదారు అమ్ముతున్న నలుగురిని పట్టుకున్న జైనథ్ సి.ఐ డి.సాయినాథ్, ఏఎస్ఐ సిరాజ్ , ముంతాజ్ కానిస్టేబుల్స్ మధుకర్, రవీందర్, దినేశ్ ,సంజయ్ లను డిఎస్పీ జీవన్ రెడ్డి అభినందించారు. మండలంలో ఎక్కడైనా దేశీధారు, పేకాట, మట్కా,గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లయితే సమాచారం (జైనథ్ సి.ఐ 8712659916, భీంపూర్ ఎస్ఐ 8712659931లకు)  ఇవ్వగలరని వారి వివరాలను గోప్యంగా  ఉంచుతామని సి.ఐ డి.సాయినాథ్ తెలిపారు.
Comments