అదిలాబాద్ : అక్షరతెలంగాణ :
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీక్షకు తరలిరావాలి
తెలంగాణ జాగృతి మరియు యూ పి ఫ్ పిలుపునిచ్చారు.
బీసీ బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత 72 గంటల నిరాహారదీక్ష.
ఆగస్టు 4 నుంచి 7వరకు ఇందిరా పార్క్ లో నిరసన, నిరాహార దీక్ష.
గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదించకుంటే.. రాష్ట్రపతి బిల్లు పాస్ చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లీగల్ ఫైట్ చేయడం లేదు.
ఎన్నికలు నిర్వహించడం ఎంత ముఖ్యమో.. బీసీ రిజర్వేషన్లు కల్పించడం అంతే ముఖ్యం
బిహార్ ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ ఢిల్లీలో దీక్ష పేరుతో మోసం చేస్తున్నది.
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించడంతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్నారు
• ఆగస్టు 4వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఇందిరాపార్క్ లోని ధర్నా చౌక్ లో నిరాహార దీక్ష చేస్తారు.
• కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఏడాదిన్నరగా అనేక ఉద్యమాలు చేశారని.. ఆ ఉద్యమాలకు దిగివచ్చే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ, కౌన్సిల్ లో బీసీల కోసం రెండు వేర్వేరు బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించింది
• అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో కేంద్ర ప్రభుత్వం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఆ ప్రయత్నం చేయలేదు..
• ఢిల్లీలో ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీనే హాజరుకాలేదు. ఇప్పుడు ఢిల్లీలో ధర్నా పేరుతో మరో డ్రామాకు కాంగ్రెస్ తెరతీసింది.. కేవలం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని కాంగ్రెస్ అంటోంది
• రాష్ట్ర హైకోర్టు చెప్పింది కాబట్టి సెప్టెంబర్ నెలాఖరులోకా ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది.. గడువులోగా ఎన్నికలు నిర్వహించడం ఎంత ముఖ్యమో.. బీసీలకు రిజర్వేషన్ల కోటా పెంచడం కూడా అంతే ముఖ్యం.
• అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలుపలేదు.. అది పెండింగ్ లో ఉండగానే రాష్ట్ర కేబినెట్ 2018 పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ తీర్మానం గవర్నర్ కు పంపింది. గవర్నర్ గారు ఆ తీర్మానానికి ఆమోదం తెలపకుండా న్యాయ సలహా కోసం ఢిల్లీలోని సొలిసిటర్ జనరల్ కు పంపారు.. సొలిసిటర్ జనరల్ న్యాయ సలహా ఇచ్చేందుకు ఎంత సమయం తీసుకుంటారో తెలియడం లేదు
• తమిళనాడు గవర్నర్ తమ కేబినెట్ తీర్మానాలు, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించడం లేదని పేర్కొంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేసింది.. అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం బీసీ బిల్లుల ఆమోదం కోసం ఎందుకు హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేయడం లేదో చెప్పాలి
• తమిళనాడులో తొమ్మిదేళ్ల పాటు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు.. బీసీల రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే అక్కడ ఎన్నికలు జరిగాయి.. తెలంగాణలోనూ బీసీ రిజర్వేషన్ల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటం చేయాలి
• బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు అనేక అవకాశాలు ఉన్నా వాటిని రేవంత్ రెడ్డి ఉపయోగించుకోవడం లేదు.. కేంద్రం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం లేదంటే తన బడే భాయ్ నరేంద్ర మోదీ గారిని ఇరుకున పెట్టడం రేవంత్ కు ఇష్టం లేదు
• తాము ఢిల్లీలో నిర్వహించే ధర్నాకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలని, బీసీలు కలిసి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఉచిత సలహాలు ఇస్తున్నారు.. బీసీ కోటాలో మంత్రిగా ఉండి మీరు బీసీ రిజర్వేషన్ల సాధనకు చేసే ప్రయత్నం ఇదేనా?
• ఎమ్మెల్సీ కవిత గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే రాష్ట్ర శాసనసభ ఆవరణలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా 72 గంటల పాటు నిరాహార దీక్ష చేశారు.. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ల కోసం మళ్లీ 72 గంటల పాటు నిరాహార దీక్షకు దిగుతున్నారు.
• బీసీలు ఎమ్మెల్సీ కవిత గారి 72 గంటల నిరాహార దీక్షను విజయవంతం చేయడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతునివ్వాలి
ఈ కార్యక్రమం లో యూ పి ఫ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ మారయ్య తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు రంగినేని శ్రీనివాస్ చిన్న సాయి కృష్ణ కార్తీక్ ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Comments