ఘరానామోసం : 400 ల మంది నిరుద్యోగులకు కుచ్చు టోపీ

Madupa Santhosh CEO
 ADB : ఘరానామోసం 400 మంది నిరుద్యోగులకు కుచ్చుటోపి : అదిలాబాద్ : అక్షరతెలంగాణ
 ఆదిలాబాద్ జిల్లాలో ఘరానామోసం వెలుగులోకి వచ్చింది. మైక్రో ఫైనాన్స్ పేరిట ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టారు. దీంతో 400 మంది యువత రోడ్డున పడ్డారు
 ఆదిలాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి భారీ హంగామా జరిగింది. పలువురికి ఆర్థిక సహాయం చేశాడు. ప్రజాప్రతినిధులను, సంఘం పెద్దలను పిలిచి సన్మానాలు చేశాడు. బౌన్సర్లను ఏర్పాటు చేసుకోని రెండు నెలల క్రితం డిజిటల్ మైక్రో ఫైనాన్స్ ఆఫీసులు స్థాపించాడు.
 అందరికీ మంచి చేస్తున్న ఆ వ్యక్తి స్థాపించిన సంస్థపై ప్రజల్లో నమ్మకం కుదిరింది. ఇంతలో మైక్రో ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగాలు అంటూ ప్రకటన చేశారు. ఆ పనుల కోసం దాదాపుగా 400 మందికిపైగా ఒక్కొక్కరి వద్ద రూ.20,000 వసూలు చేశారు. రెండు నెలలు గడుస్తున్న.. ఆ నిరుద్యోగులు ఆఫీసు చుట్టూ తిరిగిన ఎలాంటి ప్రత్యామ్నాయం లేకపోవడంతో వారంతా ఒక్కొక్కరుగా ఆ ఆఫీసు వద్దకు చేరుకొని పరిశీలించారు. అతడికి ఫోన్ చేసిన ఇదిగో అదిగోనంటూ బుకాయించాడు. బాధితులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో రావడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని దుకాణం మూసుకున్నాడు. దీంతో మోసపోయామన్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం శంకర్ గూడ గ్రామానికి చెందిన జవాదేకృష్ణ గత కొన్నేళ్ల క్రితం గ్రామం వదిలి వెళ్ళిపోయాడు. గతేడాది ఎన్నికల సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నారైగా అడుగుపెట్టాడు. జిల్లాలో పలువురు ప్రజాప్రతినిధులతో తిరుగుతూ అందరికీ సుపరిచితుడయ్యాడు. జిల్లాలో పలువురు పేదలకు ఆర్థిక సహాయం చేస్తు ప్రజల్లో కనిపించాడు.
రిమ్స్ ఆసుపత్రికి రూ.1.60 కోట్ల విలువైన పరికరాలు అందజేయబోతున్నట్టు విస్తృతంగా ప్రచారం చేయించారు. ఉట్నూర్, జైనూర్తోపాటు ఆదిలాబాద్ డిజిటల్ మైక్రో ఫైనాన్స్ ఆఫీసులు ప్రారంభించాడు. డిజిటల్ మైక్రో ఫైనాన్స్ సంస్థలో పనిచేసేందుకు ఉద్యోగ ప్రకటన చేసి, మీటింగ్ ఏర్పాటు చేశాడు.

ఉద్యోగస్తులు వేసుకునే షూట్ బూటు ఐడి కార్డు కోసం ఒక్కొక్కరి వద్ద రూ.20,000 ఇవ్వాలని చెప్పాడు. దాదాపుగా 400 మందికిపైగా నిరుద్యోగుల నుంచి ఈ డబ్బులు తీసుకున్నారు. కొందరిని ఉద్యోగాల వంకతో చేర్చుకున్నాడు. కానీ శాలరీలు మాత్రమే ఇవ్వలేదు. నెల రోజుల నుంచి అందరు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అలసిపోయారు.
 ఆదిలాబాద్ లోని కార్యాలయంలో సంస్థలో ఉండే సిబ్బందిని పలువురు బాధితులు నిలదీశారు. క్రిష్ణకు కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. సిబ్బంది మంగళవారం సాయంత్రం వేతనాలు చెల్లిస్తామని చెప్పి అదే రోజు సాయంత్రం నుంచి కార్యాలయాన్ని మూసేసి పత్తా లేకుండా పోయారు. దీంతో తాము మోసపోయినట్లు గ్రహించిన బాధితులు భారీ సంఖ్యలో ఆందోళన చేపట్టారు.ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ అఖిల్ మహాజన్ కు ఫిర్యాదు చేశారు. తమను డిజిటల్ మైక్రో ఫైనాన్స్ సంస్థ నిండా ముంచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉట్నూరులోనూ బాధితులు సంస్థ కార్యాలయం వద్ద చేరుకొని ఆందోళన చేపట్టారు. చివరకు ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
 నీరు పెద నిరుద్యోగులను నమ్మించిన ఓ ప్రైవేట్ సంస్థ అందిన కాడికి దండుకొని దుకాణం ఎత్తేసింది. 'డిజిటల్' మైక్రోఫైనాన్స్' పేరిట సంస్థను ఏర్పాటు చేసి అమా యక గిరిజనుల నుంచి డబ్బులు వసూలు చేశారు. తర్వాత రేపుమాపు అంటూ బుకాయించారు. బాదితులు ప్రశ్నించడంతో మంగళవారం నుంచి కనిపిం చకుండా పోయారు. ఈ వ్యవహారం జిల్లా కేంద్రం లోని  అగ్రికల్చర్ కేంద్రం సమీపాన గల ఆఫీసు లో   చోటు చేసుకుంది. బాధితులు బుధవారం ఎస్సీ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా పోలీస్ బాస్ ఎదుట తమ గోడు వెల్లబోసుకు న్నారు. ఉద్యోగం వస్తుందని ఆశపడి అప్పుసొప్పు చేసి కొందరు, బంగారు ఆభరణాలు అమ్మి మరికొందరు..డబ్బులు ఇచ్చారు.
రెండు నెలల క్రితం ఇంద్రవెల్లి మండలంలోని శంకర్ గుట్టకు చెందిన ఓ వ్యక్తి ఎన్ఆర్ఐ పేరిట సోషల్ మీడియాలో హల్చల్చేశారు. పేదల కోసమే తాను ఇక్కడికి వచ్చానని నమ్మ బలికాడు. ఆదిలా బాద్ పట్టణంలోని రాంనగర్ లోని వ్యవసాయ పరిశోధన కేంద్రం పక్కనగల ఓ బిల్డింగ్లో కార్యాలయం ప్రారంభించాడు. అలాగే ఉట్నూర్, జైనూర్ ప్రాంతాల్లో బ్రాంచ్లు సైతం ఓపెన్ చేశాడు. రిమ్స్ అభివృద్ధికి రూ.కోటి వరకు ఖర్చు చేస్తానని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అందరి దృష్టిలో పడ్డాడు. ఆసుపత్రి అధికారులను కలిసి అంబులెన్స్, వ్యాన్లు, స్ట్రెచ్చర్లు, ఏసీలు, వీల్ చైర్లు, కుర్చీలు తదితర వస్తువులు ఇస్తానని లెటర్ ప్యాడ్ అందజేశాడు. దీంతో అధికారులు ఆయనను నమ్మారు. తర్వాత జిల్లా కేంద్రంలోని సినిమా రోడ్ లోని ఓ హోటల్లో 200 మంది నిరుద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశాడు. ఉపాధి అవకాశాలు కల్పిస్తానని నమ్మబలకడంతో వారంతా ఆయన వలలో చిక్కారు. వారిని ఉట్నూర్లోని పూలాజీ బాబా ఆలయానికి కాన్వాయ్ ద్వారా తీసుకెళ్లా డు. అక్కడ నిర్వాహకులకు 2 కిలోమీటర్ల వరకు రోడ్డు వేయిస్తానని , తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని నమ్మబలికాడు. ఇవన్ని చూసి నిరుద్యోగులు తమకు మేలు చేకూరుతుం దని ఆశపడ్డారు.
డిజిటల్ మైక్రోఫైనాన్స్ పేరిట కృష్ణ అనే వ్యక్తి ఈ సంస్థను ఏర్పాటు చేశాడు. జిల్లాలోని ఆయా గ్రామా ల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. నిరుద్యోగు లకు బ్యాంకులో ఉద్యోగాలు, ఎలాంటి విద్యాఅర్హత లేకపోయినా ఏదో ఒక ఉద్యోగం కల్పిస్తానని నమ్మిం చాడు. ముఖ్యంగా ఆదివాసీలను టార్గెట్ చేశాడు. రెండు జతల యూనిఫాం, పూ కోసమని, ఇతర ఖర్చుల కోసం రూ.20వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ శాతం రూ.20, 40, 60 , 80 వేలు చొప్పున చెల్లించారు. బజార్హీత్నూర్ మండలానికి చెందిన మెస్రం ప్రహ్లాద్ కు డబ్బులు ఇచ్చామని బాధితులు చెబుతున్నారు. కార్యాలయా నికి వెళితే రేపుమాపు అంటూ కాలం వెళ్లదీశాడు. వారంతా మంగళవారం ఒత్తిడి చేయగా బుధవారం దుకాణం షట్టర్ మూసివేసి పరారైనట్లు తెలుస్తోం ది. దాదాపు రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు సమాచారం. ఉద్యోగంలో చేరిన తర్వాత ఎలాంటి షూరిటీ లేకుండా లక్షల రుణం, నెలకు రూ.15వేల వేతనం, యూనిఫాం, షూ, ఇతర ఆల వెన్సులు ఇప్పిస్తానని నమ్మబలికాడు.
బాధితుల్లో తలమడుగు మండలంలోని ఝరి, బ రంపూర్, దేవాపూర్, గుడిహత్నూర్ మండలంలోని గోండ్ అర్కాపూర్, ఆదిలాబాద్ పట్టణంతో పాటు పాచ్చర, ఉట్నూర్ తదితర గ్రామాల వారు అదిలాబాద్ పరిసర ప్రాంతాల గ్రామాల వారు బాధితులుగా మిగిలారు..
Comments