ADB: తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య -జిల్లా కలెక్టర్ రాజర్షి షాఅదిలాబాద్ : అక్షరతెలంగాణ :
శ్రీ దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, బానిస బంధాల నుంచి , వెట్టి చాకిరి విముక్తి కోసం నడుం బిగించి తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని అన్నారు.
నైజాం కుట్రలతో చిందిన దొడ్డి కొమ రయ్య రక్తంతో తెలంగాణ రక్త సిక్తమైందని, బాంచెన్ దొర కాల్ మొక్తా అంటూ దొర పెత్తనంలో నలిగిన వాళ్లను బందూకులు చెత బట్టి పోరాడే దిశగా నడిపించిన ధీరుడు కొమురయ్య అని కొనియాడారు.
దాష్టికాలను భరించలేక..
నిజాం పాలన సమయంలో నల్గొండ జిల్లాలో భాగంగా ఉన్న కడివెండిలో పేదలు, సామాన్యుల బతుకులు, భూమి, పంట, పశువులు, పారే నీళ్లపైనా జనాలకు హక్కులు ఉండేవి కావు. పటేల్, పట్వారీల దుర్మార్గాలతో ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు.
ఈ క్రమంలో పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామాన్ని కేంద్రంగా చేసుకొని ప్రజలతో వెట్టిచాకిరి చేయించుకుంటూ ప్రజల మాన, ప్రాణాలతో చెలగాటాలకు కడవెండిలో నిజాం నిరంకుశ
పాలనను వ్యతిరెకిస్తూ దాష్టికాలకు స్వస్తి పలికేందుకు పీడిత ప్రజలు ఎర్ర జెండా నీడలో పోరు బాట పట్టారు. భూమి కోసం.. భూక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం.. ఆనాడు కడవెండి లో అంకురార్పణ జరిగిన పోరాట చరిత్ర ప్రపంచంలోని పీడిత ప్రజల్లో ఉద్యమ స్పూర్తిని రగిల్చింది. 19 సంవత్సరాల వయసులో 1946 జూలై 4 న గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తూ ఆంధ్ర మహాసభకు జై అంటూ నినాదాలు చేసే క్రమం లో కాల్పులు జరిపిన క్రమం లో ముందు వరుసలో ఉన్న కొమురయ్య పొట్టలో బుల్లెట్లు దుసుకెళ్లాడంతో ఆ మహనీయుడు నేలకొరిగాడు.
తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి స్ఫూర్తిని రగిలించిన దొడ్డి కొమురయ్య.
దొడ్డి కొమురయ్య అమరత్వం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు .
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ యువరాజ్, rdo వినోద్ కుమార్, వెనుకబడిన తరగతుల అభివృధ్ధి శాఖ అధికారి రాజాలింగు, గొల్ల కురుమలు సంఘ నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
Comments