శ్రీ రామ నామ సంకీర్తనలతో అంగరంగ వైభవంగా శోభాయాత్ర

Madupa Santhosh CEO
ADB:   శ్రీ రామ నామ సంకీర్తనల తో అంగరంగ వైభవంగా శోభాయాత్ర 
అదిలాబాద్ : అక్షరతెలంగాణ  
శ్రీశ్రీ శ్రీరామ నవమిని పురస్కరించుకొని శ్రీ రాముని భారీ ఉత్సవ విగ్రహంతో  శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగినది. శోభయాత్ర ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాళ్ల బండి మహేందర్ ఆధ్వర్యంలో.. శ్రీ శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం లో మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి స్వామి, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గొడెం నగేష్, స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్, జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ లు ముఖ్య అతిథులుగా హాజరై  శ్రీ రాముని ఉత్సవ విగ్రహానికి   ప్రత్యేక పూజ లు చేసి శోభాయాత్ర ను ప్రారంభించారు.  భక్తులు పురహాప్రముఖులు  భజన సంకీర్తనలతో పరవసింప జేశారు.ఉత్సవ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున జైశ్రీరామ్.. జై.. జై ..శ్రీరామ్ అంటూ చేసిన నామస్మరణ నినాదాలతో పట్టణంలోని పురవీధులు మారుమ్రోగి పోయాయి. శోభాయాత్రను పురస్కరించుకొని  కాషాయం జెండాలు పట్టణ పురవీధులు, చౌరస్తా ప్రాంగణాల్లో  కాషాయ తోరణాలు  కట్టడంతో పట్టణమంతా కాషాయమయంగా మారిపోయింది. దీంతో శోభాయాత్రకు ఆదిలాబాద్ జిల్లా చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భక్తులు పాల్గొని శోభాయాత్రకు ఒక వన్నె తీసుకు వచ్చారు.  పట్టణ గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో.. శ్రీరాముని శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది.   జిల్లా పోలిస్ అధికారి ఎస్పీ అఖిల్ మహాజన్  ఈ శోభయత్రను డ్రోన్ ద్వారా పేరవేక్షించారు. ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఈ శోభాయాత్ర ర్యాలీ శ్రీరామ నవమి  పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇది  హైందవ ధర్మం కాపాడుకునే ప్రక్రియలో ఓక భాగంగా ఉపయోగపడును హిందు బంధువుల సమైఐక్యతకు నిదర్శనం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో హిందువులంతా ఏకథాటిగా ఏకంగా ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా అవసరం ఉందని తెలిపారు.
Comments