హనుమాన్ జయంతి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి : డీఎస్పీ వెంకట్ రెడ్డి.

Madupa Santhosh CEO
హనుమాన్ జయంతి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి: డి.ఎస్.పి వెంకట్ రెడ్డి
నారాయణఖేడ్ : అక్షరతెలంగాణ : 
నారాయణఖేడ్ పట్టణం లో శోభా యాత్ర నిర్వహించే సమయంలో ఇతర మతాల వారి మనోభావాలను కించపరిచే విధంగా నీనాదాలు చేయరాదు.
సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరమైన పోస్టులు, తప్పుడు ప్రచారాలను చేస్తే కఠిన చర్యలు తప్పవు. నియోజకవర్గం పరిధిలో డీజే లకు అనుమతి లేదు. నారాయణఖేడ్ డిఎస్పి వెంకట్ రెడ్డి. శనివారం హనుమాన్ జయంతి సందర్బంగా శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని ఖేడ్"డి.ఎస్.పి శుక్రవారం ఒక ప్రకటనలో  తెలిపారు. హనుమాన్ శోభాయాత్ర లో ప్రజలకు ఎలాంటి ట్రాపిక్  ఇబ్బందులు కలగకుండా నిర్దేశించిన మార్గం ద్వారా,సమయపాలన పాటిస్తూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకోవాలని అన్నారు.శోభ యాత్ర నిర్వహించే సమయంలో ఇతర మతాల వారి మనోభావాలను కించపరిచే విధంగా నినాదాలు చేయరాదని మత సామరస్యంతో సోదరభావంతో ర్యాలీ నిర్వహించుకోవాలని అన్నారు. సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరమైన పోస్టులు,తప్పుడు ప్రచారాలను పోస్టు చేస్తూ వివాదాలకు దారి తీసే విధంగా పోస్టు చేస్తే కఠిన చర్యలు తప్పవని డి.ఎస్.పి అన్నారు.
Comments