అక్రమ ఇసుక రవాణా పై ఉక్కు పాదం : ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి.
అదిలాబాద్ : అక్షరతెలంగాణ :
-జైనథ్ పోలీస్ స్టేషన్ నందు మూడు టిప్పర్లు, ఒక జెసిబి స్వాధీనం.
-అర్ధరాత్రి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన జైనథ్ పోలీసులు.
12 మందిపై సెక్షన్ 3 మరియు పిడిపిపి ఆక్ట్ కింద కేసు నమోదు.
- వాహన డ్రైవర్లు, యజమానులు, ఇసుక సరఫరా చేయు వ్యక్తులపై కేసు నమోదు. చేసారు.
జిల్లాలో ఎక్కడ ఎలాంటి అక్రమ దందాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ఆదేశాల మేరకు అదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి, ఆధ్వర్యంలో జైనథ్ సిఐ డి. సాయినాథ్, జైనత్ ఎస్సై వి.పురుషోత్తం మరియు పోలీస్ సిబ్బంది శివాజీ, నర్సింగ్,మనోజ్ లు కలిసిశుక్రవారం రోజున జైనథ్ మండలం సాంగ్వి గ్రామంలో పెనుగంగ నది నుండి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం మేరకు అర్థ రాత్రి 01:00 గంటల సమయంలో సాంగ్వి నుండి ఆదిలాబాద్ కు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు టిప్పర్లు MH27 BX 6222, TS01 UC 6741 , TS12 UB 8510 మరియు ఒక JCB TS01 ER 5027 వాహనాలను సీజ్ చేసి అట్టి వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు గంగాధర్,షేక్ మోసిన్, వెంకటేష్,సతీష్ మరియు వాటి వాహనాల యజమానులు వంగల తిరుపతిరెడ్డి, రాకేష్ రెడ్డి, కొండా లక్ష్మణ్, జ్ఞానేశ్వర్ ఇట్టి ఇసుక సరఫరా చేయు వ్యక్తులు పెందూరు గణేష్, పెందూర్ మాధవ్, నాగుల నరేష్ లపై ఇసుక దొంగతనం మరియు sec 3 of PDPP act క్రింద కేసు నమోదు చేయడం జరిగింది. కావున అక్రమ దందాలు నిర్వహించే వారిపై ఉక్కు పాదము మోపుతున్నట్లు డి.ఎస్.పి జీవన్ రెడ్డి తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలు ఎవరు నిర్వహించిన వారిపై కఠినచర్యలుతీసుకోబడతాయని హెచ్చరించారు.
Comments