మహనీయుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా , ఎస్పి అఖిల్ మహాజన్

Madupa Santhosh CEO

మహనీయుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి:జిల్లా కలెక్టర్  రాజర్షి షా.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
అదిలాబాద్ : అక్షరతెలంగాణ
మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని  జిల్లా కలెక్టర్ రాజర్షి షా  అధికారులు, సంఘ నాయకులకు సూచించారు.
షెడ్యూల్డు కులాల అభివృధ్ధి శాఖ ఆద్వర్యం లో బుధవారం నిర్వహించిన  డా,,బాబూ జగ్జీవన్ రాం, డా,, అంబేడ్కర్ జయంతి వేడుకలకు సంబంధించి సన్నాహక సమావేశం లో  జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలసి పాల్గొన్నారు.
ఈ నెల ఏప్రిల్‌ 5 వ తేదీన బాబూ జగ్జీవన్‌ రామ్‌ 118 వ జయంతి, ఎప్రిల్ 14 న 134 వ అంబేద్కర్‌ జయంతి నీ పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అధికారులు, సంఘాల నాయకులతో  సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 5 న బాబు జగ్జీవన్‌రామ్‌ 118వ జయంతి, , 14న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 134 వ జయంతిని జిల్లాలో ఘనంగా నిర్వహించాలని , అందుకు సంబంధిత శాఖల అధికారులు మున్సిపల్, పంచాయితి , విద్యుత్, తదితర ఆన్ని ఏర్పాట్లు చేయాలని ఆన్నారు.
పోలీస్ శాఖ తరుపున గట్టి బందోబస్తు ను ఏర్పాటు చేయాలని, బెల్ట్ షాపులను మూసివేయించాలని  సూచించారు.
 వివిధ సంఘాల అభిప్రాయాల మేరకు సలహాలు, సూచనల ప్రకారం జయంతి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందనీ, 
మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియజేసే విధంగా పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం జరుగుతుందని అందుకు విద్యాశాఖ ఆన్ని ఏర్పాట్లు చేయాలని ఆన్నారు.
  ఎస్ టి యు  భవన్ లో జయంతి వేడుకల నిర్వహించనున్న సందర్భంగా  వసతులు, భోజన సౌకర్యం, మజ్జిగ , తదితర సదుపాయాలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఆన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్.డి వో   వినోద్ కుమార్, డి ఎస్ సి వో  సునీత, సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Comments