అతివలకు అండగా అదిలాబాద్ షి టీం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Madupa Santhosh CEO
అతివలకు అండగా ఆదిలాబాద్ షి టీం. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.అదిలాబాద్ : అక్షరతెలంగాణ : 
 -మహిళలకు ఎలాంటి సమస్యలున్న ఆదిలాబాద్ షీ టీం బృందాలను సంప్రదించాలి 
 -మహిళలు:  కళాశాలల నందు, ఉద్యోగ స్థలాల నందు వేధింపులపై నిరభ్యంతరంగా ఫిర్యాదు చేయాలి.
 - షీ టీం ను సంప్రదించవలసిన నెంబర్ 8712659953
 -గత నెలలో జిల్లా వ్యాప్తంగా 34 అవగాహన కార్యక్రమాలు, 3 - ఈ పెట్టి కేసులు, 1 - ఎఫ్ఐఆర్ కేసు నమోదు.
అతివలకు అండగా ఆదిలాబాద్ షీ టీం బృందాలు 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ అందుబాటులో ఉండనున్నట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ఐపీఎస్ తెలియజేశారు. మహిళలు, విద్యార్థిని లకు ఉద్యోగస్థలాల నందు కళాశాలల నందు ఎలాంటి సమస్యలున్న వేధింపులు ఉన్న జిల్లా షీ టీం బృందాలను సంప్రదించాలని తెలిపారు. షీ టీం బృందాలని సంప్రదించడానికి 24 గంటలు పని చేసేలా ఒక మొబైల్ నెంబర్ను 8712659953 తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లా నందు గత నెలల నందు 34 అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా ఫిర్యాదులు అందిన వాటిలో మూడు ఈ పెట్టి కేసులు మరియు మావల పోలీస్ స్టేషన్ నందు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ఈ ఐదుగురు సిబ్బంది జిల్లా వ్యాప్తంగా గల అన్ని పాఠశాలలు కళాశాలలో ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థినిలకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ లపై, మహిళలపై  సైబర్ నేరాలు జరుగు పద్ధతులను, మహిళా చట్టాలపై, నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ చైతన్య పరిచయం జరుగుతుందని తెలిపారు.
Comments