త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గున్నాయి. ఈ విషయం స్వయంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి తెలిపారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఈ భారాన్ని ఆయా కంపెనీలు హెచ్ పి, భారత్, నయరా, ఈసర్, జియో చమురు కంపెనీలు భరించేలా ప్లాన్ చేసింది. అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే మార్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ముడి చమురు దేశాలు వాటి ధరలను తగ్గింపు చేయడం వల్ల భారత్ ప్రయోజనం పొందే అవకాశాలు కోకొల్లలు, దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను తగ్గించే స్థితిలో ఉన్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు.
భారత్ 40 దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తోందని పెట్రోలియం, సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రస్తుత ముడి చమురు ధరలు స్థిరంగా ఉంటే ఓఎంసీలు ఇంధన ధరలను తగ్గించే సామర్థ్యంతో ఉంటాయన్నారు. బీజేపీ పాలిత, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల మధ్య ధరల్లో లీటరుకు రూ. 10-12 తేడా ఉంటుందని కూడా గమనించాల్సిన విషయం ఉందన్నారు. భారత్ లోఎల్పీజీ కనెక్షన్లను గణనీయంగా పెరిగాయని,2014లో 14కోట్లుగా ఉండగా ప్రస్తుతం
31కోట్లకు పెరిగాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు.
భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత చౌకైన వంట గ్యాస్ ను అందిస్తోందన్నారు. ఉజ్వల స్కీము కింద ఎల్పీజీ రోజుకు కేవలం రూ.5మాత్రమే, ఉజ్వల వినియోగదారులకు కాని వారికి రోజుకు రూ. 14మాత్రమే తీసుకుంటున్నామన్నారు. దీంతో FY25లో చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఎల్పీజీపై రూ. 41, 338 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. దీన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది.
వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టంచేశారు.
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం పరస్పర సుంకాల కారణంగా ట్రేడ్ వార్ వస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో అంతర్జాతీయ ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 63 డాలర్లకు దిగి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ సుంకం పెంపు చోటుచేసుకోవడం గమనార్హం.
చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో చమురు సంస్థలు తమ లాభాల్లో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసుకుంటాయి.
రిటైల్ ధరలకు వర్తించబోదు. ఫలితంగా ఈ భారం సామాన్య వినియోగదారులపై పడబోదని పురి స్పష్టం చేశారు. “అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారల్కు 70-75 డాలర్ల నుంచి 60 డాలర్లకు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం విధించాలని నిర్ణయించాం.
దీనివల్ల కేంద్రానికి రూ.32 వేల అదనపు ఆదాయం సమకూరనుంది. సమీప భవిష్యత్తులో చమురు ధరలు పెరగని పక్షంలో పెట్రో ధరలను తగ్గించే అవకాశం కూడా ఉంది" అని మంత్రి వెల్లడించారు. తాజా నిర్ణయంతో పెట్రోల్పై కేంద్రం పన్నులు లీటర్కు రూ.21.9కి, డీజిల్పై రూ.15.8కి చేరాయి. భారత్లో పెట్రోల్, డీజిల్ వార్షిక వినియోగం 16,000 కోట్ల లీటర్లు. మన చమురు అవసరాలకు 85 శాతం దాకా దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉన్నది.
Comments