నక్సలైట్ల పేరుతో అమాయక ఆదివాసీలపై దమనకాండ ను ఆపివేయాలి : బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ,ప్రజాసంఘాలు

Madupa Santhosh CEO
ADB : నక్సలైట్ల పేరుతో అమాయక ఆదివాసీలపై దమనకాండ ను ఆపివేయాలి : బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ,ప్రజాసంఘాలు:అదిలాబాద్ : అక్షరతెలంగాణ 
  బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ  మరియు ప్రజాసంఘాలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మధ్య భారత దేశంలోనీ మావోయిస్టుల పేరుతో ఆదివాసిలపై   హత్యకాండల ను 
ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలనీ
-మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి!
-వనరులను కార్పోరేట్లకు దోచిపెట్టెందుకు కుట్ర!
-కర్రెగుటలలో పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలి!
-ఆదివాసీల హననానికి ముగింపు పలకాలనీ కొవ్వొత్తులతో నీరసనా ర్యాలీ ఈ సందర్భంగా పలువురు వ్యక్తలు మాట్లాడుతూ! గద్దల శంకర్ సీనియర్ బహుజన నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సిర్ర దేవేందర్ కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ , న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు బి వెంకటనారాయణ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెపల్లి మల్లేష్ ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గణేష్ మహరాజ్, బహుజన్ వంచిత్ అగాడి పార్టీ జిల్లా అధ్యక్షులు దండిగే  సందీప్ వెట్టి మనోజ్ తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి
-ప్రజా సంఘాల నాయకులు  డిమాండ్!
 కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై అమలు చేస్తున్న ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని  డిమాండ్ చేశారు. ఆదివారం రోజున  అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమురం భీమ్ విగ్రహం ఎదుట ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని,అమాయకపు ఆదివాసీల ప్రాణాలను కాపాడాలని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వారు నిరసన కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ, చత్తీస్ ఘఢ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకపు ఆదివాసీలను మావోయిస్టులను చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ వారితో చర్చలు జరపకుండా కర్రెగుట్టల ప్రాంతాలలో కేంద్ర బలగాలు  మోహరించడంవలన ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని  భయాందోళనలతో భయాందోళనలతో బతుకుతున్నారని అన్నారు. మావోయిస్టులు  శాంతి చర్చలకు సిద్ధమైనప్పుడు వారితో ఎందుకు చర్చలు జరపడం లేదని గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్టీ రామారావు,మర్రి చెన్నారెడ్డి,వైయస్ రాజశేఖర్ రెడ్డిలు చర్చలు జరిపిన విషయాన్ని వారు ప్రస్తావించారు. సహజ వనరులను కార్పోరేటర్ శక్తులకు దారతత్వం చేయడం కోసమే ఆపరేషన్ కాగార్ ను చేపట్టారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో దర్శనాల నగేష్ గోడం గణేష్ వెట్టి మనోజ్ సలాం వరుణ్  గేడం కేశవ్ రాహుల్  ఆత్రం గణపతి తోదశం ప్రకాష్ తదితరులు పాల్గోన్నారు.
Comments