జైనథ్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు.రైతుల వద్ద అధిక వడ్డీ వసూలు చేసి, భూమిని రాయించుకున్న వడ్డీ వ్యాపారీ.అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు.
అమాయక ప్రజలు, రైతుల వద్ద అధిక వడ్డీ వసూలు చేస్తూ వారి భూములను వడ్డీ పేరుతో రాయించుకుంటున్న వడ్డీ వ్యాపారిపై ఆదిలాబాద్ జిల్లా జైనథ్ పోలీస్ స్టేషన్ నందు రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలియజేశారు. వివరాలలో జైనథ్ మండలం రైతు గోస్కుల నరసయ్య ఫిర్యాదు మేరకు కేదార్పూర్ గ్రామానికి చెందిన బోయర్ రమేష్ 2011 సంవత్సరంలో 25 శాతానికి వడ్డీ కి మూడు లక్షలు డబ్బులు ఇచ్చి తన 1.36 ఎకరాల భూమిని తన తమ్ముడు గజానన్ పేరుపై రాయించుకున్నాడని 2013 సంవత్సరంలో బాధితుడు 2 లక్షల రూపాయలు మరియు 2017 సంవత్సరంలో రెండు లక్షల రూపాయలు చెల్లించిన తిరిగి తన భూమిని తనకు ఇచ్చేయాలని చెప్పినా నిరాకరించడం జరగడంతో బాధితుని ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 97/25 తో అండర్ సెక్షన్ 318 (4) బి ఎన్ ఎస్ తో కేసు నమోదు చేయడం జరిగిందని, అతనిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు.
అదేవిధంగా అతని ఇంటి వద్ద తనిఖీ చేయగా అతని వద్ద సంతకం చేసిన రెండు ఖాళీ బ్యాంకు చెక్కులు, 32 సేల్ డీడ్లు, రెండు ధరణి సేల్ డీడు, 31 ఫిక్స్ డిపాజిట్ పత్రాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వాటి విలువ దాదాపు ఒక కోటి 55 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. దీనిపై ఇతనిపై క్రైమ్ నెంబర్ 98/25తో సెక్షన్ 3(5)(b) మనీ లెండర్స్ యాక్ట్ తెలంగాణ తో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని వడ్డీ పేరుతో భూములను రాయించుకుంటున్న వడ్డీ వ్యాపారులకు రైతులు మోడిగేజ్ చేయాలని సూచించారు. లైసెన్సు లేనటువంటి అనధికారికంగా వడ్డీలు ఇచ్చేటువంటి వ్యాపారుల వద్ద వడ్డీలు తీసుకోకుండా ఉండటం ఉత్తమ లక్షణం అని తెలిపారు. అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జైనథ్ సిఐ డి సాయినాథ్ ఎస్సై వి పురుషోత్తం పాల్గొన్నారు.
Comments