వేములవాడ : అక్షర తెలంగాణ
భీమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు జూన్ 15 నుంచి భీమేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు దర్శనాలు, అభిషేకాల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. జూన్ 10 లోగా భీమేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లను అందుబాటులోకి తీసుకురానున్నామని చెప్పారు.
వేద పాఠశాల ముందు ఉన్న స్థలంలో శృంగేరీ శంకర మఠం ఖాళీ స్థలంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అభిషేకాలు, నిత్యకల్యాణం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులను ఆయన ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. జూన్ 15న ప్రారంభం కానున్నాయి.
ఏప్రిల్ 15కల్లా పనులకు సంబంధించిన మార్పుచేర్పులతో తుది ప్రణాళిక రెడీ చేసి, 21న టెండర్లు పిలిచేందుకు అధికారులు సిద్ధమయ్యారు. హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధ్యక్షతన మంగళవారం సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎండోమెంట్ కమిషనర్ శ్రీధర్, ఓఎన్డీ సోమరాజు హాజరయ్యారు.
ఆలయ విస్తరణ పనులకు సంబంధించిన ఆర్కిటెక్ట్ రూపొందించిన నమూనాను పరిశీలించారు. కొన్ని మార్పులు, చేర్పులు చేసి రెండు రోజుల్లోగా తుది ప్లాన్ రెడీ చేయాలని ఆర్కిటెక్ట్ ను అధికారులు ఆదేశించారు. ఈ పనుల కోసం ఆర్అండ్్బ, దేవాదాయ శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ ఈ నెల 15న ఎండోమెంట్ కమిషనర్తో కలిసి వేములవాడ ఆలయాన్ని సందర్శించనుంది. ఇప్పటికే వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించి రెడీ చేసిన మాస్టర్ ప్లాన్ను ఈ అధికారుల బృందం పరిశీలించింది. ఈ క్రమంలోనే ఈ నెల 21న టెండర్లు పిలిచేందుకు ఆర్అండ్ బీ అధికారులు సిద్ధమయ్యారు. ప్రధాన ఆలయం మినహా మిగతా పనులు చేపట్టనున్నారు. ఈ పనులతో భక్తులకు స్వామివారి దర్శనాల్లో అంతరాయం కలగకుండా ఉండేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. భీమన్నగుడిలో రాజన్నను దర్శించుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. శృంగేరి పీఠాధిపతుల సూచన మేరకు ఆలయ ప్రాంగణ విస్తరణ, దర్శన మార్గాల అభివృద్ధి, అదనపు మండపాలు, పార్కింగ్ సదుపాయం, లైటింగ్ వ్యవస్థలతోపాటు పౌరాణికతకు హాని కలగకుండా ఆధునికీకరణ పనులు చేపట్టనున్నట్లు ప్రణాళికలు రూపొందించారు. ఈ పనులు వేగవంతంగా పూర్తిచేసేందుకు ప్రభుత్వవిప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవ తీసుకుంటున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో పనుల్లో కదలిక
గత నవంబర్ 20న సీఎం రేవంత్ రే డ్డి రాజన్న గుడికి చేరుకుని రూ.47 కోట్లతో విస్తరణ పనులు చేపట్టేందుకు భూమిపూజ నిర్వహించిన విషయం తెలిసిందే. బడ్జెట్లో రూ.100కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ధర్మగుండాన్ని తాత్కాళికంగా మూసివేసి పార్కింగ్ స్థలంలో షవర్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. భీమన్న ఆలయంలోనే కోడెమొక్కులు చెల్లించుకునేందుకు ఏర్పాట్లు
చేస్తున్నారు. భీమన్నగుడికి ప్రస్తుతం ఉన్న ప్రధాన ద్వారంతోపాటు మరో ద్వారాన్ని శృంగేరి పీఠాధిపతుల అనుమతులతో చేపట్టనున్నారు. ఈనెల 15న దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆర్అండ్ శాఖల అధికారులు వేములవాడలో పర్యటించి పూర్తి ప్రణాళిక తయారు చేయనున్నారు. దీనిపై 16 దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖతో సమావేశమవుతారు. తుది ప్రణాళికపై సూచనలు, సలహాల కోసం ఈనెల 17న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అధికారులు శృంగేరిపీఠానికి వెళ్తారు. అయితే ఇప్పటికే భీమన్నగుడిలో వివిధ ఏర్పాట్లు చేసేందుకు శృంగేరిపీఠాధిపతుల నుంచి రాజన్న ఆలయ అధికారులకు అనుమతిపత్రాలు వచ్చాయని ఆలయ అధికారులు తెలిపారు.
Comments