సూర్యాపేట: అక్షరతెలంగాణ
నకిలీ రేడియాలజిస్ట్ అని తేలినా సీజ్ చేయకపోవడం లోని ఆంతర్యం ఏమిటి.
ఆపిల్ స్కానింగ్ సెంటర్ కు తాళం... ఆపిల్ సిటీ స్కాన్ సెంటర్ ఓపెన్. అక్కడా.. ఇక్కడా..నకిలీ రేడియాలజిస్ట్ ఓనర్ ఒక్కడే..
"వైద్యో నారాయణ హరి" అన్న నానుడి సత్యం .. ప్రకారం వైద్యులకు దేవుడి అంత గౌరవ స్థానం ఈ సమాజంలో ఉంది. కానీ కొందరు నకిలీ వైద్యులుగా చలామణి అవుతూ ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. తమకు అర్హత లేనప్పటికీ సంబంధిత శాఖ అధికారులను మచ్చిక చేసుకుంటూ మాయ బుచ్చి తమ ఆనదికార దందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. సాక్షాత్తు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డాక్టర్లు ఆకస్మిక తనిఖీలు జరిపి ఆపిల్ స్కాన్ రేడియాలజిస్ట్ సోమ కిరణ్ అర్హత లేని నకిలీ రేడియాలజిస్ట్ అని తేల్చి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యవర్గంతో కలిసి జిల్లా కలెక్టర్కు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి నివేదిక ఇచ్చినప్పటికీ ఆపిల్ స్కాన్ సెంటర్ ను నేటికీ సీజ్ చేయకపోవడం లోని ఆంతర్యం ఏమిటో అర్థం కాకుండా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా హాస్పటల్ ఆపిల్ స్కాన్ సెంటర్ పేరు మీద రిజిస్టర్ కాబడి ఉన్నప్పటికీ అప్పటికప్పుడు రేడియాలజిస్ట్ పేరు మార్చి మరో పేరు చేర్చడం పలు వివాదాలకు తావిస్తుంది. అదే సంస్థ పేరుతో రేడియాలజిస్ట్ పేరు మారినంత మాత్రాన మళ్లీ స్కానింగ్లు చేయవచ్చా అనే అనుమానాలు, సందేహాలు పలువురు వ్యక్తపరుస్తున్నారు.
ఆపిల్ స్కాన్ సెంటర్ ఓనర్ కం రేడియాలజిస్ట్ ఆయన సోమ కిరణ్ కేవలం ఎంబిబిఎస్ అర్హత మాత్రమే కలిగి ఉన్నప్పటికీ ఆయన మహారాష్ట్రలో చదివిన కళాశాలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎలాంటి గుర్తింపును ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఇతర రాష్ట్రంలో చదివిన సోమ కిరణ్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో ఎండి రేడియాలజిస్టుగా రిజిస్టర్డ్ కాలేదు. అంతేకాకుండా ఎండి అర్హత లేనప్పటికీ స్కానింగ్ సెంటర్ బోర్డుల పైన సోమ కిరణ్ రేడియాలజిస్ట్ ఎండి అనే పేరును ఎలా పెట్టుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. నకిలీ రేడియాలజిస్ట్ గా రెన్యువల్ చేయడంలో సంబంధిత వైద్య ఆరోగ్యశాఖ అధికారులపై పలు విమర్శలు గుప్పుమంటున్నాయి. కళ్ళు మూసుకొని రెన్యువల్ చేస్తున్నారా, సర్టిఫికెట్లు చూడకుండా, వెరిఫికేషన్ లేకుండా, లేదంటే అవినీతికి పాల్పడి అందిన కాడికి పుచ్చుకొని రెన్యువల్ చేస్తున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత 15 ఏళ్లుగా అర్హత లేకుండా వేలాది మందికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఎంతోమంది అనారోగ్యానికి సోమ కిరణ్ కారణమయ్యాడని పలువురు వాపోతున్నారు. అంతేకాకుండా లింగ నిర్ధారణ పరీక్షల విషయంలో కూడా ఆయన నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించాడని ఆరోపణలు లేకపోలేదు. ఆయా ఆస్పత్రి నుంచి డాక్టర్లకు భారీ మొత్తంలో పర్సంటేజీల ఆశ చూపి భారీగా ప్రజల నుంచి డబ్బును అక్రమార్గంలో సంపాదించి కోట్లకు పడగలెత్తారని పలువురు చర్చించుకుంటున్నారు.
ఆపిల్ సిటీ స్కాన్ లోనూ రేడియాలజిస్ట్ ఇతనే అయినప్పటికీ యదేచ్చగా నడపడంలోని ఆంతర్యం ఏమిటి...?
ఆపిల్ స్కాన్ సెంటర్ ఓనర్ అర్హతలేని రేడియాలజిస్ట్ సోమ కిరణ్ తన పేరు మీదనే మరొక ఆపిల్ సిటీ స్కాన్ సెంటర్ ను తిరుమల గ్రాండ్ పక్కన నడుపుతున్నారు. అక్కడ కూడా సోమ కిరణ్ రేడియాలజిస్ట్ గా చలామణి అవుతున్నారు. ఆపిల్ స్కాన్ సెంటర్లో నకిలీ రేడియాలజిస్ట్ గా స్కానింగ్ సెంటర్ కు తాళం వేసుకోగా ఆపిల్ సిటీ స్కాన్ కు మాత్రం నేటికీ తెరిచి ఉండటం గమనార్హము. పట్టణం నడిబొడ్డున నకిలీ రేడియాలజిస్ట్ అని సంబంధిత అధికారులు తెలిసినప్పటికీ ఆపిల్ సిటి స్కాన్ తెరిచి ఉంచితే సూర్యాపేట జిల్లా సంబంధిత శాఖ అధికారులకు కనిపించడం లేదా... కనిపిస్తున్న కళ్ళు లేని కబోదులు అయ్యారా అన్న ప్రశ్నలు పలువులు లేవనెత్తుతున్నారు. ఇటీవలనే అర్హత లేని టెక్నీషియన్ స్కానింగ్ చేసిన విషయంలో శరత్ కార్డియాక్ సెంటర్ ను సీజ్ చేసిన సంబంధిత అధికారులకు ఆపిల్ స్కాన్ సెంటర్ ను సీజ్ చేయకపోవడంలో ని ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఒక సెంటర్ పట్ల ఒక విధంగా మరొక సెంటర్ పట్ల మరొక విధంగా వివక్షత ప్రదర్శించే
అధికారులు అసలు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారా అన్న సందేహాలు ఇలాంటి విషయాల్లో సామాన్య మానవులకు సైతం కలగక మానదనే పలువురు పేర్కొంటున్నారు.
అంతా కామన్...వారం రోజుల్లో మళ్ళీ ఓపెన్ చేద్దాం...!!
నకిలీ రేడియాలజిస్ట్ గా రెడ్ హ్యాండెడ్ గా అధికారులకు దొరికినప్పటికీ ఇదంతా మామూలు విషయమని, మరో వారం రోజుల్లో స్కానింగ్ సెంటర్ ఓపెన్ చేద్దామని తన సిబ్బందితో సదరు నకిలీ రేడియాలజిస్ట్ కం ఓనర్ చెబుతున్నట్టు సమాచారం. ఇదంతా మామూలేనని చాలా సింపుల్గా ఇంత సీరియస్ అయిన విషయాన్ని కొట్టి పారేసినట్టు తెలిసింది.అరెస్టు చేయాల్సిందే... దోపిడి సొమ్ము కట్టించాల్సిందే...!!
నకిలీ రేడియాలజిస్ట్ గా సూర్యాపేట పరిసర ప్రాంత ప్రజలను 15 సంవత్సరాలుగా కోట్లాది రూపాయలు అక్రమార్జన చేసిన నకిలీ, అర్హత లేని రేడియాలజిస్ట్ ను వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని, అక్రమ ఆస్తులను అన్నింటిని ప్రభుత్వం స్వాధీన చేసుకోవాలని, ఈ విషయంలో పోలీస్ అధికారులు సుమోటోగా కేసు నమోదు చేయాలని పలువురు కోరుతున్నట్టు సమాచారం. జిల్లా అధికారులు ఈ విషయంలో తగు చర్యలు తీసుకొని పక్షంలో ఆపిల్ స్కానింగ్ సెంటర్ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు తగు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
Comments