Warangal: అక్షరతెలంగాణ
ఏప్రిల్ 27వ తేదీన వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహించాలని భావిస్తున్న క్రమంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వరంగల్ పోలీస్ కమీషనర్ కు నోటీసులు జారీ చేసింది. సభకు అనుమతిని ఎందుకు నిరాకరించారో పూర్తి వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లు
అత్యంత ఘనంగా లక్షలాది మందితో సభ నిర్వహించి మళ్లీ ప్రజాక్షేత్రంలో దూకుడుగా వెళ్లాలని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద సభను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది. అక్కడ రైతులతో మాట్లాడి నిర్వహణకు కావలసిన నో అబ్జెక్షన్ పత్రాలు కూడా తీసుకుంది. ఇక సభ నిర్వహణ కోసం శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం తదితర ఇతర విషయాలతో పర్మిషన్ కోసం బీఆర్ఎస్ నేతలు పోలీసులను ఆశ్రయించారు.
హైకోర్టుకు బీఆర్ఎస్ నేతలు
ఇప్పటికే మార్చి 28వ తేదీ తో పాటు, ఏప్రిల్ 4వ తేదీన రెండుసార్లు సభ అనుమతి కోసం పోలీసులకు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ పోలీసులు ఇప్పటివరకు ఎటు తేల్చుకోకపోవటంతో బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం మేరకు, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు నిన్న విచారణ జరిపింది.
హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు
తాము సభ నిర్వహించుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నామని, రైతుల వద్ద నుండి కూడా నిరభ్యంతర పత్రాలను తీసుకున్నామని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ప్రభుత్వం తరపు
పూర్తి వివరాలు సమర్పించాలన్న హైకోర్టు
దీంతో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు సభ అనుమతి విషయంలో పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని సూచించింది. ప్రభుత్వానికి , వరంగల్ సిపి కి ఆదేశాలు జారీ చేస్తూ ఈ పిటిషన్ పై విచారణను ఏప్రిల్ 17వ తేదీకి వాయిదా వేసింది. బీఆర్ఎస్ నేతలు సభకు అనుమతి విషయంలో కోర్టును ఆశ్రయించినా సరే టెన్షన్ పడుతున్నారు.
Comments