ఎస్.ఎస్.సి ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు : జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్

Madupa Santhosh CEO
NRML: ఎస్.ఎస్. సి ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు: జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్
  నిర్మల్: అక్షరతెలంగాణ
పదవ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుభాకాంక్షలు తెలిపారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి విజయాన్ని సాధించిన విద్యార్థులు, వారిని ప్రోత్సహించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.
బుధవారం విడుదలైన ఫలితాల్లో నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో కలెక్టర్ స్పందిస్తూ, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించండి” అని ఆకాంక్షించారు. అనుతీర్ణులైన విద్యార్థులు అధైర్యపడవద్దని, తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ విజయం వైపు ప్రయాణం కొనసాగించాలని కలెక్టర్ సూచించారు.
Comments