Earthquake: తెలంగాణలో భారీ భూకంపం " తక్షణ హెచ్చరిక"

Madupa Santhosh CEO
 HYD  భూకాంపాల హైఅలెర్ట్ : తెలంగాణకు భారీ భూకంప తక్షణ హెచ్చరిక:Earthquake:హైదరాబాద్ : అక్షర తెలంగాణ : 
భూపాటలం లోని మార్పులు , భూ పొరలలో కదలికల వివిధరకాల మార్పుల వలన భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నది.
భూ కంపాల గురించిన ఊహాగానాలు ప్రజల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. రామగుండం కేంద్రంగా భూమి గట్టిగా కంపించే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.
భూ ప్రకంపనల ప్రభావం హైదరాబాద్ మహానగరం నుండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వరకు విస్తరించ వచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.  ఈ భూమి లోపలి అలజడికి కారణమేమిటి? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

“తెలంగాణలో భూకంపం వచ్చే ఛాన్స్ ఉంద"ని ఎర్త్ క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ అనే ఒక సంస్థ చేసిన ప్రకటన
ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వారి పరిశోధనల ప్రకారం, రామగుండం ప్రాంతం భూగర్భంలో ఏదో కదలిక జరుగుతోందని, ఫలితంగా భారీ భూకంపం సంభవించవచ్చని వారు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఈ ప్రకంపనలు చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్, వరంగల్ వంటి నగరాలతో పాటు సుదూర ప్రాంతమైన అమరావతిని కూడా ప్రభావితం చేయగలవని వారి నివేదికలో పేర్కొన్నారు.

అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ ఎర్త్ క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ సూచనలను మాత్రం ప్రభుత్వ వర్గాలు కానీ, పేరుమోసిన శాస్త్రీయ సంస్థలు కానీ ఇంతవరకు ధృవీకరించలేదు. భూకంపాలను ఖచ్చితంగా ముందుగా ఊహించడం అనేది ఇప్పటికీ సైన్స్కు అందని ద్రాక్ష అని అధికారులు తేల్చి చెబుతున్నారు. ఇలాంటి ఊహాగానాలు చాలాసార్లు నిజం కాకపోవచ్చు అని అభిప్రాయపడుతున్నారు.
భూమి పొరల నిర్మాణం ప్రకారం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పెసిఫిక్ జోన్ రెండవ, మూడవ ప్రాంతాలలో ఉన్నాయి. ఈ జోన్లు సాధారణంగా తక్కువ నుండి మధ్యస్థ తీవ్రత కలిగిన భూకంపాలను మాత్రమే సూచిస్తాయి. గతంలో ఇక్కడ చిన్న చిన్న భూకంపాలు వచ్చినా, అవి ఎలాంటి పెద్ద నష్టాన్ని కలిగించలేదు. 

పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో పెద్ద భూకంపం వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ, దీనికి అధికారికంగా ఎలాంటి బలమైన ఆధారం లేదు. భూకంపాల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిదే కానీ, నిర్ధారణ లేని సమాచారంపై అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
గతంలో తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించిన సందర్భాలు ఉన్నప్పటికీ, భారీ భూకంపాల చరిత్ర అంతగా లేదు. 1969లో ప్రకాశం జిల్లాలో 5.1 తీవ్రతతో ఒక భూకంపం వచ్చింది. ఆ తర్వాత 1998లో ఆదిలాబాద్లో 4.5 తీవ్రత నమోదైంది. హైదరాబాద్లో కూడా కొన్నిసార్లు స్వల్ప ప్రకంపనలు వచ్చినా, వాటి వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. శ్రీశైలం డ్యామ్ ప్రాంతంలో కూడా భూమి కదిలినట్లు రికార్డులు ఉన్నాయి.భూకంపాల సమయాన్ని, తీవ్రతను కచ్చితంగా అంచనా వేయడం ఇప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి, ప్రజలు తమ భద్రత కోసం కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద భూకంపాలు రాకపోయినా, ప్రకృతి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి
Comments