న్యూస్ డెస్క్ : అక్షరతెలంగాణ :
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి తమ గ్రామానికి బస్సు వచ్చినందుకు ఘనంగా స్వాగతం పలుకుతున్న మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో కటేఝరి గ్రామ ప్రజలు. దాదాపు 80 ఏళ్ల నుంచి తమ గ్రామానికి బస్సు లేక నానా ఇబ్బందులు పడ్డ ప్రజలు. ఇన్ని రోజులు నక్సల్స్ ప్రభావిత గ్రామం అవడం వల్ల ఎన్నిసార్లు ఈ గ్రామానికి వసతులు కల్పించాలని చూసినా నక్సల్స్ అడ్డుకోవడం వల్ల అది సాధ్యం కాలేదు. ఆపరేషన్ కర్ర గట్టు తర్వాత దాదాపుగా నక్సల్స్ తగ్గిపోయింది. ఇప్పుడు ఆ ప్రభావిత ప్రాంతాలంతా మిగతా దేశ ప్రాంతాలతో తమ సంబంధాలను కొనసాగించుకునేందుకు ఇదొక గొప్ప అవకాశం కలిగించినట్లు అయింది. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నట్లు, ప్రభుత్వం నుంచి తమకు అన్నీ వసతులు ఇకనైనా తమకు కల్పించాలని అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు..
Comments