న్యూస్ డెస్క్: అక్షరతెలంగాణ :
అంగన్వాడి జీతాల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాసిన బహిరంగ లేఖను తప్పు పట్టిన అంగన్వాడి టీచర్లు హెల్పర్లు.
హరీష్ రావు తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన తెలంగాణ ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్
యూనియన్ అధ్యక్షులు జీ. అన్నపూర్ణ, కార్యదర్శి వీ. శ్రీదేవి.మినీ అంగన్వాడి టీచర్లకు 10 ఏళ్లుగా పదోన్నతులు కల్పించని అసమర్ధుడు హరీష్ రావు
కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చింది
గతంలో మాకు నెలకు రూ. 7800 జీతం వచ్చేది
ఇప్పుడు మాకు నెలకు 13650 రూపాయల జీతం ఇస్తున్నారు.నెలకు రూ. 5850 జీతాన్ని పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు
హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నెలల తరబడి అంగన్వాడీ టీచర్లకు సిబ్బందికి జీతాలు పెండింగ్లో పెట్టారు .సచివాలయం చుట్టూ కాలు అరిగేలా తిరిగినా ఎలాంటి ప్రయోజనం జరగలేదు
పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీలను ఆదుకునేందుకు ఏనాడు జీవోలు జారీ చేయలేదు
జీవోలు అమలు కావద్దన్న ఉద్దేశంతోనే ఎన్నికల కోడ్ వచ్చినప్పుడే జీవోలు ఇచ్చి చేతులు దులుపుకునేవారు. కనీసం గతంలో మంత్రులు మమ్మల్ని కలిసే వారే కాదు. ఇప్పుడు మంత్రి సీతక్క వద్దకు నేరుగా వెళ్ళగలుగుతున్నాము . మా సమస్యలు విని ఒక్కొక్కటిగా మంత్రి సీతక్క గారు పరిష్కరిస్తున్నారు . ఒక్క నెల కూడా పెండింగ్ జీతం పెట్టకుండా సకాలంలో జీతాలు చెల్లిస్తున్నారు.
Comments