ములుగు : అక్షరతెలంగాణ
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన ప్రకటనపై ములుగు కేంద్రంలో మంత్రి సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు.
దేశవ్యాప్తంగా జనగణన తో పాటు కుల గణనను చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం
పార్లమెంటు లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కుల గణన ప్రక్రియను పూర్తి చేయగా, ఇప్పుడు విది లేని పరిస్థితుల్లో కేంద్రం దిగి వచ్చింది
కేంద్రం కుల గణన చేపడతామని ప్రకటించడం తెలంగాణ ప్రభుత్వ ముందు చూపునకు నిదర్శనం
రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేపట్టినప్పుడు స్వయంగా ప్రధానమంత్రి అపహస్యం చేస్తూ మాట్లాడారు
సమాజాన్ని చీల్చేందుకు, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కుల గణన చేపట్టిందని పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ గారు రాజకీయ విమర్శలు చేశారు
మరి ఇప్పుడు మీరు ఎందుకు కుల గణన చేస్తామని ప్రకటించారు? మీరు కూడా సమాజాన్ని చీలుస్తున్నట్లేనా?
అది కాకపోతే... ఓట్ల కోసమే కాంగ్రెస్ పై విమర్శలు చేసాము అని తప్పును ఒప్పుకొని క్షమాపణలు కోరాలి . అప్పుడే మిమ్మల్ని బీసీ సమాజం నమ్ముతుంది. బీసీల మీద అనగారిన వర్గాల మీద బిజెపి పెద్దలకు ప్రేమ ఏమీ లేదు. తెలంగాణలో కుల గణన చేపట్టడంతో ఇతర రాష్ట్రాల్లో, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది
కుల గణన తేల్చకపోతే పుట్టి మునగడం ఖాయం అన్న భయం బిజెపికి పట్టుకుంది
ప్రజల డిమాండ్లకు తలోగ్గి తప్పనిసరి పరిస్థితుల్లోనే కేంద్ర ప్రభుత్వం కుల గణనకు అంగీకారం తెరపాల్సి వచ్చింది. అయితే మొదట తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసిన బీసీ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉంది
కేంద్రము తక్షణం ఆ బిల్లుకు ఆమోదం తెలిపితే తెలంగాణలో బీసీ లకు ప్రయోజనాలు పెరుగుతాయి
దాన్ని ఆమోదించకుండా.. ఆ సర్వే సరిగా జరగలేదని సన్నాయి నొక్కులు నొక్కడం తెలంగాణ అసెంబ్లీని, తెలంగాణ సమాజాన్ని అవమానపరచడమే అవుతుంది
తెలంగాణ ప్రభుత్వం అత్యంత పారదర్శకతతో పూర్తి చేసిన కుల గణన ప్రక్రియ మీద మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తాం
కానీ అలా కాకుండా తెలంగాణ బీసీ బిల్లుకు కేంద్రం ఆమోదముద్ర వేయకపోతే వెనుకబడిన వర్గాల నుంచి మీరు వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది
ఇప్పటికే జన గణన ఆలస్యమైన నేపథ్యంలో ప్రజలకు సంక్షేమం సరిగా అందడం లేదు
జనాభా పెరిగినా, ధరలు పెరిగినా కొన్ని సంక్షేమ పథకాలకు కేటాయింపులు పెరగడం లేదు
2011 జనాభా లెక్కల ప్రకారం 2013లో దేశంలో 81 కోట్ల మందికి ఆహార భద్రత చట్టం కింద రేషన్ బియ్యం పంపిణీ జరిగితే.. ఇప్పటికీ కేంద్రం కొత్త కార్డులు ఇవ్వలేదు
పదేళ్లలో జనాభా పెరిగినా రాష్ట్రాలకు రేషన్ కోట కేంద్ర ప్రభుత్వం పెంచలేదు
పైగా ఏవేవో సాకులు చెబుతూ కోటిన్నర మందికి కోత విధించింది అదే జనగణన జరిపితే.. ఎంతమంది అర్హులో తేలుతుంది.2021 లో జరగాల్సిన జనగణన నాలుగు సంవత్సరాలు ఆలస్యమైంది
అందుకే వీలైనంత తొందరగా జన గణన తో పాటు కుల గణన ప్రక్రియను పూర్తి చేసి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం
అట్లా కాకుండా కేవలం బిహార్ ఎన్నికల నేపథ్యంలోనే కుల గణన చేస్తామని కేంద్రం ప్రకటన చేసిందని అనుమానాలు ఉన్నాయి
ఎందుకంటే బీసీ కుల గణన ప్రక్రియ ను బీహార్లో జె డి యు, ఆర్ జె డి కూటమి ప్రభుత్వం చేపడితే.. కేంద్ర బిజెపి కూలగొట్టింది
అక్కడ బీసీ కులగల ప్రక్రియ ముందుకు పోకుండా ప్రభుత్వాన్ని పడగొట్టింది
ఆ తర్వాత జె డి యూ తో కలిపి ప్రభుత్వాన్ని బిజెపి ఏర్పాటు చేసి బిసి బిల్లును అమలు కాకుండా చేశారు.దీంతో అక్కడ బీసీలు బిజెపి మీద గుర్రుగా ఉన్నారు అందుకే కుల గణన అని కొత్త డ్రామా బిజెపి ఆడుతుందనే అపవాదులున్నాయి
వాటిని చెరీపేసుకోవాల్సిన అవసరం బిజెపి మీద ఉంది.కాబట్టి చిత్తశుద్ధితో కుల గణన ప్రక్రియను త్వరగా చేపట్టి పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ పక్షాన కోరుకుంటున్నాము
Comments