అమ్మాయిలను .. ఫోటోలు తీస్తూ...వెంబడించిన వ్యక్తి అరెస్ట్ : షీ టీం స్పెషల్ ఆపరేషన్

Madupa Santhosh CEO

ADB : అమ్మాయిలను ఫోటోలు తీస్తూ వెంబడించిన వ్యక్తి అరెస్ట్.. షీ టీం స్పెషల్ ఆపరేషన్.అదిలాబాద్ : అక్షరతెలంగాణ
 బాధితురాలు ఫిర్యాదు తో తన స్నేహితురాలు గా వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా నిందితుని పట్టుకోవడం జరిగింది.అమ్మాయిలను వారికి తెలియకుండా ఫోటోలు తీస్తూ,వారిని వెంబడించిన వ్యక్తి అరెస్ట్.
ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు.
ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  ఆధ్వర్యంలో ఆదిలాబాద్ షీ టీం బృందం 24 గంటలు అప్రమత్తమై విధులను నిర్వర్తిస్తుందని అందులో భాగంగానే, ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మహిళ తనని బస్ స్టాప్ నందు ఒక యువకుడు వెంబడిస్తున్నాడని కారణంతో ఆదిలాబాద్ షీ టీం బృందాన్ని సంప్రదించగా షీ టీం బృంద సభ్యులు తనతో తన మిత్రులుగా వెళ్లి స్పెషల్ ఆపరేషన్ చేసి నిందితుడైనటువంటి   కత్తుల్వార్ వేణు తండ్రి లింగన్న మెకానిక్ వృత్తి నిర్వహిస్తూ శాంతినగర్ నందు నివసిస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా సంఘటన స్థలంలో ఫోటోలు తీస్తూ పట్టుబడ్డాడని షీ టీం బృంద సభ్యులు శ్రీవాణి తెలియజేశారు. వివరాలలో నిందితుడు అమ్మాయిల ఫోటోలను వారికి తెలియకుండా తీస్తూ ఫోన్ నందు ఉంచుకుంటున్న విషయాన్ని తన ఫోన్ చేసి విచారించగా తెలిసిందని తెలిపారు. నిందితునిపై షీ టీం ఫిర్యాదు చేయగా ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 251/2025 తో అండర్ సెక్షన్ 78(2) ఎఫ్ బి ఎన్ ఎస్ మరియు 67 ఆఫ్ ఐ టి యాక్ట్ తో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఆదిలాబాద్ రెండవ పట్టణ సీఐ సిహెచ్ కరుణాకర రావు తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళలు యువతులకు విద్యార్థినులకు ఆదిలాబాద్ షీ టీం బృందం ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తుందని ఎలాంటి సహాయం కైనా 8712659953 నెంబర్ కు సంప్రదించాలని తెలిపారు. షి టీం అప్రమత్తంగా ఉంటూ క్షణాల వ్యవధిలో బాధితులకు అండగా ఉంటుందని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతూ వారి సమస్యలను పరిష్కరించబడతాయని తెలిపారు.
Comments