నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం: నలుగురిపై కేసునమోదు, ముగ్గురు అరెస్ట్: ఏఎస్పీ కాజల్ సింగ్ ఐపిఎస్ ( ఉట్నూర్)

Madupa Santhosh CEO

నకిలీ విత్తనాలపై ఉక్కు పాదం:  నలుగురిపై కేసు నమోదు, ముగ్గురి అరెస్ట్. ఎ ఎస్పి కాజల్ సింగ్ ( ఉట్నూర్) : 
అదిలాబాద్ : అక్షరతెలంగాణ 
 - 27 నకిలీ విత్తన ప్యాకెట్లు స్వాధీనం.
 - అమాయక ప్రజలు రైతులే టార్గెట్ గా విత్తనాలు అమ్ముతున్న వ్యక్తులు.
 - జిల్లా ఎస్పీ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆపరేషన్.
 - నకిలీ విత్తనాలపై ఎలాంటి సమాచారం ఉన్న సిసిఎస్ ఇన్స్పెక్టర్ 8712659965 కు సమాచారం అందించాలి . 
జాధవ్ గజానంద్ తండ్రి కిషన్, వయస్సు: 35 సంవత్సరాలు, కులం: బీసీ-బీ (ఆరే మరాఠా), వృత్తి: వ్యవసాయం,  ఇస్లామ్‌నగర్, ఇచ్చోడా మండలం.కు చెందిన వాడు . కంది శివ కుమార్ తండ్రి భోజన్న, వయస్సు: 27 సంవత్సరాలు, కులం: మున్నూరుకాపు, వృత్తి: వ్యవసాయం,  కోకస్మన్నూర్ గ్రామం, ఇచ్చోడా మండలం. చెందిన వాడు.కొతపల్లి రవీందర్ తండ్రి నర్సయ్య, వయస్సు: 32 సంవత్సరాలు, కులం: మున్నూరుకాపు, వృత్తి: వ్యవసాయం,  కోకస్మన్నూర్ గ్రామం, ఇచ్చోడా మండలం. చెందిన వాడు.ఆదవ్ రవికాంత్  తండ్రి   గంగాధర్, వయస్సు: 30 సంవత్సరాలు, కులం: బీసీ-బీ, వృత్తి: వ్యాపారం, ముక్రా-బీ గ్రామం, ఇచ్చోడా మండలం చెందిన వాడు పరారీ లో ఉన్నాడు.

నకిలీ విత్తనాలను జిల్లాలో పూర్తిగా అరికట్టేందుకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పడి ప్రత్యేక తనిఖీలను నిర్వహిస్తుందని అందులో భాగంగానే అంటే మే 24 శనివారం. సాయంత్రం. 7.00 గంటలకు, భగత్ రమేశ్ కుమార్ తండ్రి భగత్ నామదేవ్, వయస్సు: 41 సంవత్సరాలు, వృత్తి: మండల వ్యవసాయ అధికారి, చిరునామా: ఆర్ & బి గెస్ట్ హౌస్, విద్యానగర్, ఆదిలాబాద్ నివాసమైన వారు ఇచ్చట పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా మే 24 మధ్యాహ్నం 5.00 గంటల సమయంలో విశ్వసనీయమైన సమాచారం ఆధారంగా పోలీసు శాఖ బృందం జాధవ్ గజానంద్ ఇంటిపై దాడి నిర్వహించగా, అక్కడ తొమ్మిది తిలక్ 5G నకిలీ విత్తన ప్యాకెట్లు కనుగొన్నారు. నకిలీ విత్తనాల విక్రయంపై అడగగా, జాధవ్ గజానంద్ నకిలీ విత్తనాలు కోకస్మన్నూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు విక్రయించినట్లు వెల్లడించారు.

అనంతరం టాస్క్ ఫోర్స్ బృందం జాధవ్ గజానంద్‌తో కలిసి కోకస్మన్నూర్ గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. విచారణలో ఆ ఇద్దరు వ్యక్తుల వివరాలు ఇలా ఉన్నాయి:
1. కె. శివ కుమార్ S/o భోజన్న, వయస్సు: 27 సంవత్సరాలు, కులం: మున్నూరుకాపు – ఇతనిది 06 విక్రాంత్-44 నకిలీ విత్తన ప్యాకెట్లు (మొత్తం 27 నకిలీ విత్తనాలు, అంచనా విలువ రూ. 32,400/-).
2. కొతపల్లి రవీందర్ S/o నర్శింలు, వయస్సు: 32 సంవత్సరాలు, కులం: మున్నూరుకాపు – ఇతనిది 12 విక్రాంత్-44 నకిలీ విత్తన ప్యాకెట్లు.
తరువాత జాధవ్ గజానంద్‌ను మరింతగా ప్రశ్నించగా, అతను ఈ నకిలీ విత్తనాలను ఆదవ్ రవికాంత్ S/o గంగాధర్, వయస్సు: 30 సంవత్సరాలు, కులం: ఆరే మరాఠా, నివాసం: ముక్రా-బి (తప్పించుకున్నాడు) వద్ద నుండి కొనుగోలు చేసి రైతులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అదనంగా, ఆదవ్ రవికాంత్ మహారాష్ట్ర నుండి నకిలీ విత్తనాలను తీసుకువచ్చి, జాధవ్ గజానంద్ ద్వారా అమాయక రైతులకు విక్రయిస్తున్నాడని పేర్కొన్నారు. ఈ నలుగురిపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు అయిందని తెలిపారు. అమాయక రైతులు మరియు ఆదివాసి రైతులను కాపాడడానికి జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి నకిలీ విత్తన మాఫియాను అరికట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఎలాంటి సమాచారం ఉన్న టాస్క్ఫోర్స్ సిఐ 8712659965 నెంబర్ కు సంప్రదించాలని తెలిపారు సంప్రదించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. రైతులకు సూచనలు ఇస్తూ డీలర్ల వద్ద, గుర్తింపు పొందిన దుకాణాల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసే ముందు విత్తన ప్యాకెట్లపై సరైన లేబుల్, ఎక్స్పైరీ డేట్, తయారీ డేట్ ఉంటాయని అదేవిధంగా వ్యాపారి వద్ద నుండి బిల్లును తీసుకోవాల్సిందిగా సూచించారు. రైతులెవ్వరు కూడా లూస్ విత్తనాలను కొనకుండా ఉండడం శ్రేయస్కరమని సూచించారు. ఎలాంటి అనుమానం ఉన్న జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.
Comments