ఆదిలాబాద్: అక్షర తెలంగాణ
తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం(TJF) ఆధ్వర్యంలో హైదరాబాద్ జలవిహార్ లో నిర్వహించనున్న రజతోత్సవ సభకు జిల్లా టీయూడబ్లూజే హెచ్ 143 యునియాన్ నాయకులు, జర్నలిస్టులు శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నుండి బయలుదేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బేత రమేష్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలనీ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎల్.రాజు, కోశాధికారి శానం ప్రవీణ్, యూనియన్ నాయకులు ఎం.సంతోష్, ఆర్.సుభాష్, తేజ, పొట్ట మల్లయ్య, కరణ్ రెడ్డి, రత్నాకర్, దేవారెడ్డి, పోచ్చరెడ్డి, గణేష్ తదితరులున్నారు.
Comments