ADB : విద్యార్థుల అంతర్ముఖ శక్తిని బహిర్గత పరిచేది విజ్ఞాన శాస్త్రమే -జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి :
అదిలాబాద్ : అక్షరతెలంగాణ
ఆదిలాబాద్, జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన వారం రోజుల సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి హాజరై సమ్మర్ క్యాంపు విజయవంతం చేసిన జన విజ్ఞాన వేదిక సభ్యులను అభినందించారు.విద్యార్థులు పాత న్యూస్ పేపర్లతో స్వయంగా తయారు చేసిన ఆకృతులను చూసి ఆనందం వ్యక్తం చేశారు. వారు తయారు చేసిన పేపర్ టోపిలను ధరించి సంతోషించారు. విద్యార్థులకు దిశ,దశ లను నిర్దేశించారు.
జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వారం రోజుల పాటు విద్యార్థులకు ఎలాంటి లాభ పేక్ష లేకుండా ఉచితంగా సమ్మర్ క్యాంపు నిర్వహించడం అభినందనీయం అనీ అన్నారు. సమ్మర్ క్యాంపు లో విద్యార్థులు నేర్చుకున్న వివిధ అంశాలను అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. కూల్ డ్రింక్స్ అలవాటుకు దూరం ఉండాలని, సమ్మర్ లోనాణ్యమైన పండ్ల రసాలు తాగాలని విద్యార్థులకు సూచించారు. భవిష్యత్తు శాస్త్రవేత్తలగా ఎదగాలని, సైన్స్ పట్లా ఆసక్తి పెంచుకోవాలని తెలిపారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన కాగితపు టోపిని ధరించి సంతోషం వ్యక్తం చేశారు.
డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ కిరణ్, జిల్లా సైన్స్ అధికారి రాఘు రమణ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి నూతుల రవీందర్ రెడ్డి, అధ్యక్షాప్రధాన కార్యదర్శులు ఉమాకాంత్, పెంటపర్తి ఊశన్న, గౌరవ అధ్యక్షులు వీరన్న, శ్రీధర్ బాబు, గంగన్న,మేస్రం రాజు, ప్రేమ్ కుమార్, సంతోష్,లింగరెడ్డి, విద్యార్థులు, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.
Comments