సిద్దిపేట : అక్షరతెలంగాణ
బీఎస్పీ సిద్ధిపేట నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్.బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ అధ్యక్షతన సిద్దిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల మల్లేశం ముదిరాజ్ హాజరయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ వికాసం స్కీం లో సిబిల్ తప్పనిసరి చేయడం చాలా దారుణమని ఈ సందర్భంగా వారు తెలిపారు. నిరుద్యోగ యువత కు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ స్కీమ్ ప్రైవేట్ బ్యాంకులు లాగా సిబిల్ ను కంపల్సరీ చేయడం ద్వారా యువత తీవ్రంగా నష్టపోతుందని వారు తెలిపారు. రాజీవ్ యువ వికాసంలో నిరుద్యోగులకు సిబిల్ స్కోర్ లింకు పెట్టి ఉపాధి కల్పించకుండా చేయడం ఇది మోసమే లక్షల్లో ఉన్న నిరుద్యోగులకు ఆశ చూపి ఇప్పుడు బ్యాంకు లింకులతో ఇబ్బందులు పెట్టడం తగదు.దేశాన్ని దోచుకొని వందల కోట్లు ఎగ్గొట్టే బడా కార్పోరేటర్లకు లేని కండిషన్లో నిరుద్యోగకు ఎందుకు తక్షణమే సిబిల్ నుండి యువతకు మినహాయింపు ఇవ్వకుంటే బహుజన్ సమాజ్ పార్టీ. పోరాటం చేస్తుంది.
Comments