అదిలాబాద్ : అక్షరతెలంగాణ
అదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సోమవారము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబ్బీర్ అలీ.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు
హాజరై ముందుగా ఎన్టీఆర్ చౌక్ లోని అమరవీరుల స్థూపం, జయశంకర్ స్టాచు వద్ద నివాళులర్పించి అనంతరం కలెక్టరేట్ ఆవరణ లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా వివరించారు.
ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, శాసన సభ్యులు పాయల్ శంకర్, అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, మార్కెట్ చైర్మన్ వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పలువురు రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల పునాదులపై, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నదని అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల స్పూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.
నర్నూర్ అస్పిరేషనల్
బ్లాక్ లో అత్యుత్తమ సేవలు అందించిన వివిధ శాఖల అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు.
Comments