ఎందుకో తెలుసా ...! ఏడు కిలో మీటర్లు అడవిలో ప్రయాణించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..

Madupa Santhosh CEO
ADB: ఎందుకో తెలుసా..! ఏడు కిలోమీటర్లు అడవిలో ప్రయాణించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్అదిలాబాద్ : అక్షరతెలంగాణ :
 -చదువు వల్ల ఆదివాసీలకు అభివృద్ధి సాధ్యం - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ 

 -మారుమూల అటవీ ప్రాంతం భగవాన్పూర్ కి ద్విచక్ర వాహనంపై చేరుకొని పోలీసు మీకోసం కార్యక్రమం ఏర్పాటు.

 -స్వయంగా అడవిలో 7 కిలోమీటర్లు ద్విచక్ర వాహనం నడిపి ఆదివాసులకు అవగాహన కార్యక్రమం.

 -భీంపూర్ మండలం గుబిడి, టెకిడి రాంపూర్, కరంజీ, భగవాన్పూర్ లలో పోలీసు మీకోసం కార్యక్రమాలు.

 -ఆదివాసీలు గంజాయి కి దూరంగా ఉండాలని, వాహనం నడిపే క్రమంలో ట్రాఫిక్ నియమాలు పాటించాలి అని సూచనలు. 
 -త్వరలోనే ఆదిలాబాద్ లో జాబ్ మేళా నిర్వహణ
 -నిరుద్యోగ యువత అగ్నివీర్ లో ఉద్యోగం సాధించి దేశ సేవ చేయాలని సూచన.
 -ఉన్నత విద్యాసభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదగాలి.
- యువత క్రీడారంగంలో అభివృద్ధి చెందాలని స్పోర్ట్స్ కిట్స్ అందజేత. 

ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ప్రజలలో మమేకమై ప్రజలకు అత్యంత చేరువై పోలీసు సేవలను అందించడానికి నిరంతరం కృషి చేస్తుందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. ఈరోజు బీంపూర్ మండలం లోని మారుమూల గ్రామాలైన గుబిడి, టెకిడి రాంపూర్, కరంజీ, భగవాన్పూర్ లను సందర్శించి ప్రజలతో పోలీసు మీకోసం కార్యక్రమాల నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అడవిలో అత్యంత మారుమూల గ్రామం భగవాన్ పూర్ కు ద్విచక్ర వాహనం తో చేరుకొని యువతకు కల్పించిన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని గ్రామస్ పేరును కీర్తి ప్రతిష్టలను పెంపొందించాలని తెలిపారు. అదేవిధంగా గ్రామాలలో ఎలాంటి గంజాయిని పండించకూడదని సేవించకూడదని తెలిపారు. చట్ట వ్యతిరేకంగా గంజాయిని పండించిన వారిపై కేసులో నమోదు చేస్తూ ప్రభుత్వ పథకాలు రాకుండా జిల్లా యంత్రాంగానికి సిఫార్సు చేయబడుతుందని తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులకు త్వరలోనే ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నందు జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందని, ఎక్కువ సంఖ్యలో యువత పాల్గొని ఉద్యోగాలు సాధించి వచ్చిన ప్రదేశంలో ఉద్యోగాల నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా యువత క్రీడారంగంలోనూ అభివృద్ధి చెందాలని నాలుగు గ్రామాలలో వాలీబాల్ కిట్లు క్రికెట్ కిట్లను అందజేసి క్రీడారంగం లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. చిన్నపిల్లలకు చదువు ఒక ప్రాధాన్యతను తెలియజేసి ప్రతి ఒక్కరూ చదువుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తెలిపారు. చదువు వల్ల భవిష్యత్తు మారుతుందని, ఉజ్వల భవిష్యత్తు సాధించవచ్చని తెలిపారు. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు సాధించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. మహారాష్ట్ర తో అనుసంధానంతో ఉన్నందున ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఎలాంటి సమాచారం అయినా తన వద్ద ఉండే ప్రత్యేకంగా నిర్వహించబడుతున్న 8712659973 అనే నెంబర్కు వాట్సప్ ద్వారా తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. అదిలాబాద్ జిల్లాలో షీ టీం బృందం మహిళలకు అండగా ఉందని, మహిళల వేధింపుల పట్ల కళాశాలలో పాఠశాలలో విద్యార్థినిలకు ఎలాంటి సమస్యలున్న షీ టీం బృందాలకు తెలియజేయాలన్నారు. షీ టీం నెంబర్ 8712659953 కు సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, జైనథ్ సిఐ డి సాయినాథ్, బీంపూర్ ఎస్సై పీర్ సింగ్ నాయక్, గ్రామ పెద్దలు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments