2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ క్రికెట్ విశ్వక్రీడల్లోకి పునరాగమనం:

Madupa Santhosh CEO
2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ క్రికెట్   విశ్వక్రీడల్లోకి పునరాగమనం: 
హైదరాబాదు: డెస్క్ : అక్షరతెలంగాణ
2028లో లాస్ ఏంజిల్స్ జరిగే ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ టోర్నమెంట్ అథ్లెట్ల గ్రామం నుండి ఒక గంట డ్రైవ్ దూరంలో ఉన్న దక్షిణ కాలిఫోర్నియా నగరమైన పోమోనాలోని తాత్కాలిక స్టేడియంలో జరుగుతుంది.
 అధికారికంగా ఫెయిర్లెక్స్ అని పిలువబడే ఫెయిర్గ్రౌండ్స్ స్టేడియం దాదాపు 500 ఎకరాల సముదాయం, ఇది 1922 నుండి LA కౌంటీ ఫెయిర్ను నిర్వహిస్తోంది మరియు క్రమం తప్పకుండా కచేరీలు, వాణిజ్య ప్రదర్శనలు, క్రీడా కార్యక్రమాలు మరియు సాంస్కృతిక సమావేశాలకు వేదికగా పనిచేస్తుంది.

"ఈ క్రీడల కోసం ప్రపంచం ఇక్కడకు వచ్చినప్పుడు, మేము అందరికీ క్రీడలను నిర్వహిస్తున్నందున ప్రతి పొరుగు ప్రాంతాన్ని హైలైట్ చేస్తాము మరియు అది ఒక స్మారక వారసత్వాన్ని మిగిల్చేలా చూసుకోవడానికి కృషి చేస్తాము" అని లాస్ ఏంజిల్స్ మేయర్ కరెన్ బాస్ ఒక ప్రకటనలో తెలిపారు. "ప్లేలాలో పది లక్షలకు పైగా నమోదులు జరిగాయని మేము ప్రకటించడంతో మేము ఇప్పటికే ఆ వారసత్వాన్ని అందిస్తున్నాము.
"ఈ కార్యక్రమాలను సాధ్యం చేసినందుకు మరియు ఇప్పటివరకు గొప్ప క్రీడలను నిర్వహించడానికి వారి నిరంతర కృషికి LA28 మరియు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను."
1900 తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్ను ఉంచడం ఇదే మొదటిసారి. అప్పుడు, గ్రేట్ బ్రిటన్ మరియు ఫ్రాన్స్ అనే రెండు జట్లు మాత్రమే రెండు రోజుల మ్యాచ్లో పోటీపడ్డాయి, గ్రేట్ బ్రిటన్ బంగారు పతకాన్ని గెలుచుకుంది.

ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చడం వల్ల ఈ క్రీడ యొక్క పెరుగుతున్న స్థాయి మరింత పెరుగుతుంది. మహిళల క్రికెట్ 2022లో బర్మింగ్హామ్ CWG అరంగేట్రం చేసింది, అయితే పురుషుల మరియు మహిళల ఆటలు రెండూ 2010, 2014 మరియు 2023లో ఆసియా క్రీడలలో భాగంగా ఉన్నాయి. ఇటీవల గ్రాండ్ ప్రైరీ, లాడరిల్ మరియు న్యూయార్క్ USA మరియు వెస్టిండీస్ కలిసి నిర్వహించిన 2024 T20 ప్రపంచ కప్లో అనేక మ్యాచ్లను నిర్వహించాయి.

128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లోకి క్రికెట్ పునఃప్రవేశించనుంది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్త్ క్రికెట్ విశ్వక్రీడల్లోకి పునరాగమనం చేయనుంది. ఒలింపిక్స్లో క్రికెట్కు సంబంధించిన షెడ్యూల్ను జులై 14న ప్రకటించారు. ఈ షెడ్యూల్ను మూడేళ్లు ముందే ప్రకటించడం విశేషం.
ఒలింపిక్స్లో క్రికెట్ పోటీలు 2028 జులై 12 (ఒలింపిక్స్ ప్రారంభానికి రెండు రోజుల ముందు) నుంచి 29 వరకు జరుగనున్నాయి. అన్ని మ్యాచ్లు లాస్ ఏంజెలెస్కు 50 కిమీ దూరంలో ఉన్న పమోనాలోని ఫెయిర్లెక్స్లో ప్రత్యేకంగా నిర్మించబడే 500 ఎకరాల తాత్కాలిక స్టేడియంలో జరుగుతాయి.
రాబోయే ఒలింపిక్స్లో క్రికెట్ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. పురుషులు, మహిళల విభాగాల్లో మొత్తం ఆరు అంతర్జాతీయ జట్లు విశ్వవేదికపై పోటీ పడతాయి. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ కోసం పోటీ జరుగుతుంది. మెడల్స్ మ్యాచ్లు (సెమీఫైనల్స్ మరియు బ్రాంజ్, గోల్డ్ మెడల్స్ మ్యాచ్లు) జులై 20 (మహిళలు), 29 (పురుషులు) తేదీల్లో జరుగుతాయి.

జులై 14, 21 తేదీల్లో ఎలాంటి క్రికెట్ మ్యాచ్లు లేవు.

మ్యాచ్ జరిగిన ప్రతి రోజు రెండు మ్యాచ్లు ఉంటాయి. ఈ మ్యాచ్లు భారతకాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు, ఉదయం 7 గంటలకు మొదలవుతాయి.
ఒలింపిక్స్లో క్రికెట్కు చివరి మరియు ఏకైక ప్రాతినిథ్యం 1900 పారిస్ ఒలింపిక్స్లో దక్కింది. నాడు గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మాత్రమే పోటీలో పాల్గొన్నాయి. అప్పుడు ఇరు జట్ల మధ్య ఓ అనధికారిక టెస్ట్ మ్యాచ్ జరగగా.. అందులో గ్రేట్ బ్రిటన్ ఫ్రాన్స్ను కేవలం రెండు రోజుల్లోనే ఓడించి  పతకం కైవసం చేసుకుంది.

భారత వన్డే జెర్సీలో వైభవ్
ఇంగ్లండ్ గడ్డపై భారత యువ సంచలనం, అండర్-19 స్టార్ వైభవ్ సూర్యవంశీ హవా కొనసాగుతోంది. బెకన్హామ్ వేదికగా ఇంగ్లండ్ అండర్-19తో జరుగుతున్న తొలి యూత్ టెస్టు మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో విఫలమైన వైభవ్.. బౌలింగ్లో మాత్రం సత్తాచాటాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన వైభవ్ రెండు కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హంజా షేక్(84),థామస్ రెవ్(34) వికెట్లను వైభవ్ పడగొట్టాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల వైభవ్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గల్ఫ్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. ఓ యూత్ టెస్టు మ్యాచ్లో వికెట్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత అండర్-19 క్రికెటర్ మనిషీ పేరిట (15) ఉండేది. తాజా మ్యాచ్లో మనిషి రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.
సూపర్ ఫిఫ్టీ..

రెండో ఇన్నింగ్స్ లో మాత్రం వైభవ్ బ్యాట్ ఝూళిపించాడు. 44 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు కెప్టెన్ ఆయూశ్ మాత్రే(32) రాణించాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి యువ భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజులో విహాన్ మల్హోత్రా (34), అభిగ్యాన్ కుందు (0) క్రీజ్లో ఉన్నారు. భారత్ 229 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చీ వాన్ 3 వికెట్లు తీశాడు. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 439 పరుగులకు ఆలౌటైంది.
బెంగళూరు వేదికగా మంగళవారం మహారాజా ట్రోఫీ కేఎస్సీఏ టీ20 టోర్నీ-2025 వేలం జరిగింది. ఈ వేలంలో -మైసూర్ వారియర్స్, హుబ్లి టైగర్స్, బెంగళూరు బ్లాస్టర్స్, శివమొగ్గ లయన్స్, మంగళూరు డ్రాగన్స్, గుల్బర్గా మిస్టిక్స్ మొత్తం ఆరు ఫ్రాంచైజీలు తమ కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసుకున్నాయి.
ఈ వేలంలో కర్ణాటక స్టార్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్పై కాసుల వర్షం కురిసింది. అతడిని హుబ్లి టైగర్స్ రికార్డు స్థాయిలో రూ.13.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పడిక్కల్ నిలిచాడు. అదేవిధంగా హుబ్లి టైగర్స్ అభినవ్ మనోహర్ను సైతం రూ. 12.20 లక్షలకు సొంతం చేసుకుంది. హుబ్లి ఫ్రాంచైజీ వీరిద్దరిపైనే దాదాపు సగంపైగా మొత్తాన్ని ఖర్చుచేసింది. టీమిండియా వెటరన్, కేకేఆర్ ఆటగాడు మనీష్ పాండేను రూ. 12.20 లక్షలకు మైసూర్ వారియర్స్ దక్కించుకుంది.

సమిత్ ద్రవిడక్కు బిగ్ షాక్..
కాగా మహారాజా టీ20 వేలంలో భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్ అమ్ముడుపోలేదు. రూ.50 వేలు కనీస ధరతో వచ్చిన అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. సమిత్ ద్రవిడ్ గత ఎడిషన్లో మైసూరు వారియర్స్ జట్టులో భాగంగా ఉన్నాడు.
అయితే అంచనాలకు తగ్గటు జూనియర్ అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాడు. గత సీజన్లో ఏడు మ్యాచ్లు ఆడిన సమిత్.. 11.71 సగటుతో 82 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడు ప్రస్తుతం వేలంలో అమ్ముడు పోలేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక ఈ మెగా టోర్నీ బెంగళూరులోని ఐకానిక్ చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆగస్టు 11 నుంచి 27 వరకు జరగనుంది. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఈ టోర్నీని ఖాళీ స్టేడియంలో నిర్వహించనున్నారు.
ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఈవెంట్లో కరుణ్ నాయర్, ప్రసిధ్ కృష్ణ,మయాంక్ అగర్వాల్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా ఆడనున్నారు.
Comments