ADB: నేటి సాంకేతికతకు అనుగుణంగా యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాదు: అక్షరతెలంగాణ
నేటి పోటీ ప్రపంచంలో యువత మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీ భవనంలో ITE&C శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్' (TASK) నూతన శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే దృఢ సంకల్పంతో 'టాస్క్' (TASK) ద్వారా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, నిరుద్యోగులకు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన టెక్నికల్, నాన్-టెక్నికల్ కోర్సులలో ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతుందని, అలాగే, కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ , ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై నిష్ణాతులైన వారిచే శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధికల్పన అధికారి మిల్కా, ఎస్బిఐ ఆర్ఏం రామచంద్ర రావు, ఎల్డియం ఉత్పల్ కుమార్, టాస్క్ అధికారులు శ్రీకాంత్ సిన్హా, రాఘవేందర్ రెడ్డి, సావీన్ రెడ్డి, బోధన సిబ్బంది, ఇతర అధికారులు, యువతీ యువకులు, తదితరులు పాల్గొన్నారు.
Comments