ఇది చాలా పవర్‌ఫుల్ హెల్త్ డ్రింక్ :

Madupa Santhosh CEO
  Health : ఇది చాలా పవర్‌ఫుల్ హెల్త్ డ్రింక్ : 
మన ఆరోగ్యం: అక్షర తెలంగాణ 
 అల్లం + కరివేపాకు + ఉసిరికాయ + పచ్చి పసుపు 
కలిపి జ్యూస్ చేశాను — ఇది చాలా పవర్‌ఫుల్ హెల్త్ డ్రింక్.

దీని లాభాలు
 • ఇమ్యూనిటీ పెరుగుతుంది (ఉసిరికాయ + పసుపు)
 • డైజెషన్ బెటర్ అవుతుంది, గ్యాస్/బ్లోటింగ్ తగ్గుతుంది (అల్లం)
 • లివర్ డిటాక్స్ కి సహాయం (కరివేపాకు)
 • ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది, జాయింట్ పెయిన్స్ కి మంచిది
 • వెయిట్ లాస్ లో హెల్ప్ చేస్తుంది (మెటబాలిజం యాక్టివ్ అవుతుంది)
 • జుట్టు, చర్మానికి చాలా మంచిది 

ఎలా తాగితే బెస్ట్?

 • ఉదయం ఖాళీ కడుపు అంటే కంప్లీట్ empty స్టమక్ కాకుండా ముందు plain వాటర్ తాగిన తరువాత కొంచం గ్యాప్ ఇవ్వండి 
 • రోజుకు 30 ml చాలు (చిన్న గ్లాస్)
 • కాస్త స్ట్రాంగ్‌గా అనిపిస్తే కొద్దిగా నీరు కలపండి, లేదా 1–2 చుక్కలు తేనె

జాగ్రత్తలు (ముఖ్యం)

 • ఎక్కువగా తాగకండి 
 • గ్యాస్ట్రిక్ / అల్సర్ / బి పి ఎక్కువ ఉంటే రోజూ కాకుండా రోజు విడిచి రోజు
 • ప్రెగ్నెన్సీ లో ఉంటే రెగ్యులర్‌గా తాగేముందు డాక్టర్ అడగడం మంచిది
 • ఫ్రిడ్జ్ లో పెట్టితే వారం నుండి 10 రోజులు మాత్రమే వాడండి
....నాకు చాలా హెయిర్ లాస్ ఉండే 2,3 మంత్స్ బ్యాక్ పాపకు కూడా ఉండేది,  2మంత్స్ నుండి ఈ జ్యూస్ తాగుతున్న,  కంప్లీట్ గా తగ్గింది హెయిర్ ఉడిపోవడం.... మరియు స్కిన్ టోన్ లో విజబుల్ చేంజెస్ కనిపిస్తున్నాయి. .

Health  గట్ హెల్త్ మెరుగుపడాలంటే మంచి బ్యాక్టీరియాకు ఆహారం ఇవ్వాలి.
మన గట్ ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం నిరంతరంగా ఇవ్వాలి. కొన్ని ఆహారాలు మంచి బ్యాక్టీరియాను నేరుగా అందిస్తాయి, మరికొన్ని వాటిని పెంచి పోషిస్తాయి.
 సావర్‌క్రౌట్ (ఫెర్మెంటెడ్ క్యాబేజీ) అత్యుత్తమ ప్రోబయోటిక్ ఆహారం. ఇందులో సహజంగా ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తికి చాలా ఉపయోగపడుతుంది.
ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే...
క్యాబేజ్ చిన్న చిన్న ముక్కలుగా కోసి ,పింక్ సాల్ట్ క్వాంటిటీ ను బట్టి యాడ్ చేసుకొని మొత్తం కలిపి బయటకు వాటర్ రిలీజ్ అయ్యేవరకు గట్టిగా కలుపుతూ ఉండాలి.వాటర్ రిలీజ్ అయ్యాక ఎయిర్ టైట్ బాటిల్ లో వేసి వన్ వీక్ వరకు గాలి ,వెలుతురు లేని ప్లేస్ లో ఉంచాలి.వన్ వీక్ వరకు మూత అసలు తీయకూడదు.వన్ వీక్ కి బాగా ఫేర్మంటేషన్ అవుతుంది.అప్పుడు డైలీ వన్ స్పూన్ మీ డైలీ food లో add చేసుకొని తినండి...
Comments