ADB: జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత ఏది..?
ఆదిలాబాద్ : అక్షర తెలంగాణ
అధికారంలోకి వచ్చే మూడేళ్లు గడుస్తున్నా జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని , ఆరోగ్య భద్రత కార్డులు అటకెక్కాయని టీయూడబ్ల్యూజే జర్నలిస్టులు ఆరోపించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం ఆదిలాబాద్, గుడిహత్నూర్, నేరడిగొండ, ఇచ్చోడ, నిర్మల్, ఆసిఫాబాద్ కేంద్రాల్లో జర్నలిస్టులు పోస్ట్ కార్డులతో తమ సమస్యలు నివేదించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని నివాళులర్పించిన అనంతరం ఆదిలాబాద్ లో పోస్ట్ ఆఫీస్ వెళ్లి సీఎం రేవంత్ రెడ్డికి జర్నలిస్టుల ఆరోగ్య భద్రత, ఈ జె హెచ్ ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలని, జర్నలిస్టుల సంక్షేమానికి మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా రూ .100 కోట్లు కేటాయించాలని యూనియన్ జిల్లా అధ్యక్షులు బేత రమేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు , సీనియర్ జర్నలిస్టులు ఎల్ రాజు, అన్వర్, ప్రేమ్ సాగర్, ఎస్.గంగాధర్ , మహబూబ్ ఖాన్, షానం ప్రవీణ్, సుభాష్, గజానంద్, సంతోష్, తేజ, సుధాకర్ , సతీష్, కొండా ప్రశాంత్ పాల్గొన్నారు.
Comments