ఉపాధ్యాయ స్థానానికి 92.46, పట్టభద్రులకు 77.24 శాతం పోలింగ్ పెరిగిన ఓటింగ్ శాతం
అదిలాబాద్ : అక్షరతెలంగాణ :
అదిలాబాద్ : అక్షరతెలంగాణ :
నిజామాబాద్ - మెదక్ - కరీంనగర్- ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. పట్టభద్రుల స్థానానికి 77.24, ఉపాధ్యాయ స్థానానికి 92.46 శాతం పోలింగ్ నమోదు.జిల్లా ల వ్యాప్తంగా : మందకొడిగా ప్రారంభమైన పట్టభద్రులకు 48, ఉపాధ్యాయులకు 33 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించగా ఓటర్లు నెమ్మదిగా వచ్చారు. మధ్యాహ్నం 12 తర్వాత ఓటింగ్ పుంజుకుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి అవకాశం కల్పించారు.
పెరిగిన ఓటింగ్ శాతం : గత ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం కొంత పెరిగింది. 2019లో పట్టభద్రుల స్థానానికి 68 శాతం కాగా.. సారి 77.24 శాతం నమోదు కావడం గమనార్హం. ఉపాధ్యాయ స్థానానికి గతంలో 90 శాతం కాగా.. ఈ సారి 92.46 శాతం నమోదైంది.
కొన్ని చితక మత్క సంఘటనలు మినహా. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతం : జిల్లాలో పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నిక గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పదకొండు గంటల వరకు మందకొడిగా సాగినా.. మధ్యాహ్నం తర్వాత పుంజుకుంది. పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నిక గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పదకొండు గంటల వరకు మందకొడిగా సాగినా.. మధ్యాహ్నం తర్వాత పుంజుకుంది. చెదురుముదురు ఘటనలు మినహా ఎటువంటి అవాంతరాలు లేకుండా సాగింది. పట్టభధ్రుల ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భాజపా, కాంగ్రెస్ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఓటర్లకు ఫోన్చేస్తూ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో అభ్యర్థుల మద్దతుదారులు మకాం వేసి ఓటర్లకు పోలింగ్ చిట్టీలు పంపిణీ చేశారు. పట్టభద్రులతో పాటు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ను ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారు పర్యవేక్షించారు.మొత్తం మూడు స్థానాలకు పోలింగ్ జరిగినప్పటికీ..
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అందరిదృష్టి ఆకర్షిస్తోంది. మొత్తం 56 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీతో పాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి మధ్య తీవ్రపోటీ..ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటినుంచి బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ ప్రచారం నిర్వహించింది. బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి,
కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పోటీచేశారు. ఈ ఇద్దరూ విజయంపై ధీమాగా ఉన్నారు. పార్టీ కేడర్తో పాటు ఆర్థికంగా బలవంతులు కావడంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం తమకు కలిసొస్తుందని బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉండటం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో బీఎస్పీ మద్దతుతో పోటీలో ఉన్న ప్రసన్న హరికృష్ణ సైతం పట్టభద్రులు తనను గెలిపిస్తారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ ముగిసినప్పటికీ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఓటర్లు
ప్రచారం ఎక్కువుగా జరుగుతోంది. ప్రధానపోటీ మాత్రం బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, ప్రసన్న హరికృష్ణ మధ్య ఉండొచ్చని, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి మూడోస్థానానికి పరిమితమయ్యే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది.
రెండో ప్రాధాన్యత ఓటుతో..
ప్రసన్న హరికృష్ణ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ సానుభూతిపరుడిగా ఉన్నారు. ఎన్నికల్లో గెలిస్తే ఆయన అధికారపార్టీ వైపే ఉంటారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్లో కొందరు ప్రసన్న హరికృష్ణకు లోపాయికారిగా సహకరించారనే ప్రచారం జరిగింది. దీంతో నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన కాంగ్రెస్ సానుభూతిపరులు తప్పకుండా రెండో ప్రాధాన్యత ఓటును ప్రసన్న హరికృష్ణ
కరీంనగర్ కు బ్యాలెట్ పెట్టెల తరలింపు :
పోలింగ్ ముగిసిన తరువాత బ్యాలెట్ పెట్టెలను కరీంనగర్ జిల్లాకు తరలించారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
Comments