తెలంగాణ లో బర్డ్ ఫ్లూ కలకలం.. వేల కోళ్లు మృతి :

Madupa Santhosh CEO
తెలంగాణకు సోకిన బర్డ్ ఫ్లూ :తెలంగాణ లో బర్డ్ ఫ్లూ కలకలం.. వేల కోళ్లు మృతి : వనపర్తి : అక్షర తెలంగాణ: ఫిబ్రవరి 19: కోళ్ళ మృతి కలకలం: మదనపురం మండలం కొన్నూరు గ్రామంలో శివకేశవరెడ్డి అనే రైతుకు చెందిన కోళ్ల ఫామ్ లో సుమారు నాలుగు వేల కోళ్లు మృత్యువాతపడ్డాయనీ ఆవేదనతో తెలిపారు. 

బర్డ్ ఫ్లూ వ్యాధితో ఇంత పెద్ద సంఖ్యలో కోళ్లు మృతి .
బుధవారం ఉదయం కూడా రైతు శివకేశవరెడ్డి కోళ్లఫామ్ కు వచ్చి చూడగా వేల సంఖ్యలో కోళ్లు చనిపోయి ఉన్నాయి. వాటిని గుంతలో మట్టిలో పోడ్చేశారు. అయితే నాలుగువేళ్ల కోళ్ల మృతిపై వెటర్నరీ అధికారులకు రైతు సమాచారం ఇవ్వగా.
అధికారులు పట్టించుకో లేదు రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. శివకేశవరెడ్డి కోళ్లఫామ్ లో నాలుగు వేల  కోళ్లు మృత్యువాతపడాయి.. రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. 
వేల కోళ్లు చనిపోవడానికి కారణం ఏంటో చెప్పాలని.. తనకు న్యాయం చేయాలని కోరారు. బర్డ్ ఫ్లూ వల్లే కోళ్లు చనిపోయాయని అనుకుంటున్నానని.. దానిపై అధికారులు నిర్ధారణ చేయాలన్నారు. ప్రతీసారి కోళ్ల ద్వారా లాభం వచ్చేదని.. ఈసారి మాత్రం పూర్తి నష్టపోయాయనని తనకు న్యాయం చేయాలని రైతు ప్రాధేయ పడుతున్నాడు .
Comments