అదిలాబాద్ : అక్షరతెలంగాణ : సమీకృత గురుకుల పాఠశాల (యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ) స్థల సేకరణ పై సెక్రటరీ బోార్డ్ ఆఫ్ ఇంటర్ మీడియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణా ఆదిత్య బుధవారం అదిలాబాద్ కలెక్టరేట్ కు చేరుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్, ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ దీపక్ తివారీ పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు.
అనంతరం కలెక్టర్ ఛాంబర్ లో ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించి అదిలాబాద్ రూరల్ నిషాన్ ఘాట్ ను పరిశీలించారు.
తెలంగాణలో విద్యా వ్యవస్థలో ప్రతిష్టాత్మకమైన మార్పులు తీసుకురావడం కోసం ప్రయోగాత్మకమైన అడుగులు వేయడం జరుగుతుందని, ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రెండు సంవత్సరాలలో నిర్మించి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం లక్ష్యం కాగా, ఈ సందర్భంగా బుధవారం కమీషనర్ కృష్ణదిత్య ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సమీకృత గురుకుల పాఠశాల కు అవసరమైన స్థలాల సేకరణ వేగవంతం చేసి రేపటి లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అన్ని హంగులతో ప్రభుత్వం నూతనంగా నిర్మించతలపెట్టిన సమీకృత రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, వసతి గృహ సముదాయం కోసం అదిలాబాద్ రూరల్ నిషాన్ ఘాట్ లో స్థలాన్ని జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారుల తో కలిసి క్షేత్రస్థాయిలో ఈ ప్రాంతాన్ని సందర్శించి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి అనువైన పరిస్థితులు, అనుకూల వాతావరణం తదితర అంశాలను పరిశీలించారు. 20 ఎకరాల స్థలం సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని నిషాన్ ఘాట్ లో 38 వ సర్వే నెంబర్ లో 20 ఎకరాల భూమిని సోషల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ వింగ్ కు (EETGEWIDC ) ను, నిర్దేశిత గడువులోగా పనులు ప్రారంభించేల ప్రణాళికలు తయారుచేసి ,
ఎక్కడైతే స్థలాల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన చోట అనుమతులు, ఇతర పనులను వేగంగా చేయాలని ఆదేశించారు. ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో ముందుగా పరిశీలించాలని సూచించారు.
అంతకు ముందు కలెక్టర్ ఛాంబర్ లో కమిషనర్ మాట్లాడుతూ ఇంటర్మీడియెట్ విద్యా పై సమీక్షిస్తూ సీసీ కెమెరాస్ గురించి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సజావుగా జరగడం , థియరీ ఎగ్జామ్స్ ను పకడ్బందీ గా నిర్వహించాలని డి ఐ ఈ ఓ సి.రవీందర్ కుమార్ ను ఆదేశించడం జరిగింది.
ఏజీఎంసీ జిల్లా అధికారులతో కళాశాలలో హాజరు శాతం, స్లిప్ టెస్టులు, అడ్మిషన్ drive గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, రెవెన్యు డివిజనల్ అధికారి వినోద్ కుమార్, ఉమ్మడి జిల్లా ఇంజనీరింగ్ వింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments