ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా :

Madupa Santhosh CEO

 ఎన్నికల  డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా.
అదిలాబాద్ : అక్షరతెలంగాణ : 
భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న . మెదక్   నిజామాబాద్, అదిలాబాద్ ,కరీంనగర్  పట్టభద్రుల, ఉపాద్యాయ నియోజకవర్గ శాసన మండలి  ఎన్నికల సందర్భంగా బుధవారం  TTDC లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను , ఎన్నికల బ్యాలెట్ బాక్స్ ల కొరకు  క్లోజ్డ్ బాడి వెహికల్స్ లో అమర్చిన gps డివైస్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి  జిల్లా కేంద్రంలోని  TTDC (టెక్నికల్ ట్రైనింగ్  డెవలప్మెంట్ సెంటర్ ) లో  పోలింగ్‌ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం లో ఏర్పాటు చేసిన ప్రతీ కౌంటర్లను పరిశీలించిన అనంతరం  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్న  నేపధ్యంలో పోలింగ్‌ విధులు నిర్వహించడానికి కేటాయించిన సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయడం జరుగుతున్నదని పేర్కోన్నారు. పోలింగ్‌ స్టేషన్ల వారీగా ఎన్నికల సామగ్రి పంపిణీకి కౌంటర్లు ఏర్పాటు చేసి పోలింగ్‌ సిబ్బందికి ఏలాంటి ఇబ్బందులు కలగకుండా సామగ్రిని పంపిణీ చేయడం జరుగుతున్నదని ఆన్నారు 
డిస్ట్రిబ్యూ షన్‌ సెంటర్‌లో తాగునీటి వసతి, భోజన వసతి కల్పించడం జరిగిందనీ, ఎన్నికల సిబ్బంది సామగ్రితో వారికి కేటాయించిన పోలింగ్‌ స్టేషన్‌కు వెళ్లేందుకు వాహనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
బ్యాలెట్ బాక్స్ లు తరలించేందుకు  6 క్లోస్డ్ బాడి వెహికల్స్ లో జీపీఎస్ డివైస్ అమర్చడం జరిగిందనీ, దీనివలన వెహికల్స్  గమ్యమార్గం లో ఎక్కడ ఉన్నాయో తెలుస్తుందని ఆన్నారు.

ఈనెల 27 న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఎమ్మెల్సి ఎన్నికలు, ప్రభుత్వ, ఎన్నికల  సంఘం ఆదేశాలు, సూచనల మేరకు పక్కాగా అమలు చేస్తూ ఎన్నికల నిర్వహణకు సిద్ధం అయినట్లు ఆయన తెలిపారు,
జిల్లాలో మొత్తం (39) పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని,  (11418) మంది మేల్, ( 5110) మంది ఫిమేల్, మొత్తం (16,528) మంది ఓటర్లు జిల్లాలో ఉన్నారని తెలిపారు,
ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల కేంద్రాలలో సీసీ కెమెరాలు, త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 
రవాణా, భద్రత, వైద్య, తదితర సౌకర్యాలు కల్పించడం జరిగిందనీ ఆన్నారు.
డిస్టిబ్యూషన్ అనంతరం వారి వారి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళడం జరుగుతుందనీ ఆన్నారు.

పోలింగ్ సిబ్బంది గ్రాండ్ total 264

*POs.                39
రిజర్వ్                   7
మొత్తం.              46
OPs.                129
రిజర్వ్.                24
మొత్తం.             153
మైక్రో అబ్ప్రవర్స్.  22
రిజర్వ్.                    6
మొత్తం.                  28
జోనల్   off              9

ప్రిసైడింగ్ అధికారులు    46
అసిస్టెంట్ ప్రిసైడింగ్.     153
                                ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, rdo వినోద్ కుమార్, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్, తహసీల్దార్లు, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Comments