మంచిర్యాల : అక్షరతెలంగాణ : పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం సభకు ముఖ్యఅతిథిగా హాజరైన సిఎం రేవంత్ రెడ్డి :
రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు ను మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్, మాజీ మంత్రి హరీష్కే రావు , మాజీ ఐటి మంత్రి కేటీఆర్ మరియు ఎమ్మెల్సీ కవితలు ఓటు హక్కును ఎటు వేస్తారో చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో సూటిగా ప్రశ్నించారు .మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ప్రదేశంలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం సభకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరైనారు.ఆ సందర్భంగా వేదికపై రేవంత్ రెడ్డి ప్రసంగింస్తూ. కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బిఆర్ఎస్ బిజెపితో కుట్రలు చేస్తున్నాయని పేర్కొన్నారు. బిజెపి బిఆర్ఎస్ చేసే కుట్రలను అందరూ గమనించాలన్నారు.అని అన్నారు. బిజెపిలో ఎనిమిది మంది ఎంపీలు,ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా రాష్ట్రానికి ఏమి తెచ్చారో చెప్పాలన్నారు.ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న బిజెపి ప్రధాని మోడీ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు.అయితే తెలంగాణలో మాత్రం బండి సంజయ్ ఇంకా కిషన్ రెడ్డికి మాత్రం రెండు ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సీఎం అన్నారు.అ దేవిధంగా మంచిర్యాల ప్రజలు అదృష్టవంతులని గుర్తు చేశారు. అమూల్య మైన ఓటు వేసి ఇద్దరు సేవకులను పొందారని తెలిపారు.మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తో పాటు డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ మంచిగా సేవలందిస్తున్నట్లు కొనియాడారు.తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే కేంద్రం నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటూ నిర్లక్ష్యం చేస్తుందన్నారు.ఆ నిధులను కిషన్ రెడ్డి సైతం అడ్డుకుంటున్నట్లు ప్రకటించారు.ముఖ్యంగా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అడ్డువచ్చిన కూడా తోసుకుంటూ వెళ్లి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు.ఆ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు శ్రీధర్ బాబు,సీతక్క,పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్,ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్,ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి,ప్రేమ్ సాగర్ రావు,గడ్డం వినోద్, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments