"మన్ కీ బాత్" కార్యక్రమంలో భరత్ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ తెలంగాణలోని ఆదిలాబాద్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కైలాష్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (Al)ని వాడుతున్న తీరును ప్రస్తావించి, అభినందించారు. తోడ్సం కైలాష్ ఓక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏఐ టూల్స్ సాయంతో ఆదివాసీల భాషల్లో ఒకటైన కొలామీ భాషలో పాటలు రూపొందించడం అద్భుతం అని పీఎం కీర్తించారు. కొలామీతో పాటు మరిన్ని ఆదివాసీ భాషల్లో పాటలు రూపొందించడానికి కైలాష్ ప్రయత్నిస్తున్నారని, ఆదివాసీ భాషలను కాపాడే చర్యల్లో ఇది కొత్త మలుపు అని నరేంద్ర మోడీ అన్నారు. దేశ ప్రజల అవసరాలు తీర్చగలిగేలా అయన కొత్త టెక్నాలజీలను వినియోగించుకోవాలని పీఎం మోడీ పిలుపునిచ్చారు.
Comments