'నంది శివాలయం' శివుని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరయిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ అదిలాబాద్ : తలమడుగు మండలంలోని నందిగామ గ్రామంలో జరుగుతున్న నంది శివాలయం ప్రారంభోత్సవం మరియు శివుని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నందిగామ గ్రామస్తులు . మహిళలు ఎమ్మెల్యే గారికి హారతి పట్టి స్వాగతించారు. ఆలయానికి విచ్చేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ నీ సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి శాలువతో సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి గ్రామస్తులు ఆలయ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ ఆధ్యాత్మికతో గ్రామ అభివృద్ధి చెందుతుందని ఆ దేవుడి దయ ఆశీర్వాదం లేనిది గ్రామ అభివృద్ధి చెందదని ఆ శివుని ఆశీర్వాదం మన గ్రామంపై నియోజకవర్గంపై ఎల్లప్పుడూ ఉండాలని శివుని ఆశీస్సులతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments