పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కే సిపిఎం మద్దతు :

Madupa Santhosh CEO
పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్థి కే  సిపిఎం మద్దతు : అదిలాబాద్ : అక్షరతెలంగాణ : 
బీజేపీ అభ్యర్థిని ఓడించండి.
కాంగ్రెస్ అభ్యర్థి  వి .నరేందర్ రెడ్డి నీ గెలిపించండి
మెదక్ ,ఆదిలాబాద్ కరీంనగర్ ,నిజామాబాద్  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  సిపిఎం పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి వి. నరేందర్ రెడ్డీ  సంపూర్ణ మద్దతు ప్రకటించింది . పార్టీ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన  పాత్రికేయుల సమావేశంలో  ఈ ప్రకటన చేశారు .ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి  దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ , కేంద్రంలో  గత 10 ఏండ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ  రెండు కోట్ల ఉద్యోగాల కల్పన హామీని గాలికీ వదిలేసింది అన్నారు . పైగా ప్రభుత్వ రంగ సంస్థల్లో 100శతం  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ బడ్జెట్  ప్రవేశ పెట్టారు .దీనిఫలితంగా  ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడి  నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం లేకుండా పోతోంది . పెరుగుతున్న ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించకుండా  ఉన్న కొద్దిపాటి రిజర్వేషన్లను కూడా తొలగించే కుట్రలు చేస్తున్నది . నిరుద్యోగ సమస్య గత ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది . పనులకోసం యువత వలస బాట పడుతున్నారు .కార్పరేట్ సంస్థలకు కోట్లాది రూపాయలు లాభాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం  ఆ సంస్థల్లో మాత్రం యువతకు రిజర్వేషన్ ఆధారంగా ఉద్యగల కల్పన చేయడం లేదు . 
ఉత్తర తెలంగాణ జిల్లాల నుండీ  8 మంది ఎం.ఎల్ .ఏలు  నలుగురు మంది  ఎంపీ లు  ,ఒక కేంద్ర మంత్రీ ఉన్నప్పటికీ  ఇప్పటి వరకు  ఈ జిల్లాలకు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి  అభివృద్ధి పరిచింది లేదు . 
బడ్జెట్లో గుండు సున్నా చూపిన వీరు నోరు మెదపడం లేదు . ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న  సిమెంట్ పరిశ్రమను తెరిపించడం లేదు , ఆదిలాబాద్ నుండీ ఆర్మూర్ రైల్వే లైన్ మంజూరుకు నోచుకోవడం లేదు ,విమాశ్రయం నిర్మాణం కలగానే మిగిలిపోయింది . గిరిజన యూనివర్సిటీ వేరేచోటికి తరలిపోతున్న పల్లెత్తి మాట కూడా మాట్లాడలేదు .అభివృద్ధి నీ ఏమాత్రం పట్టించు కోకుండా కేవలం మాత కోణంలో ప్రజలను ఛిల్సి  ఓట్ల వ్యాపారం చేస్తున్నది బీజేపీ అని మండి పడ్డారు . బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలంటే ,భవిష్యత్తులో వారు అభివృద్ధి వైపు ఆలోచించాలి అంటే ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని పట్టభద్రలు ఓడించి విజ్ఞతను చాటాలని అయన కోరారు . బీజేపీ అభ్యర్థిని ఓడించడానికి కాంగ్రెస్ అభ్యర్థికి తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్టు అయన వెల్లడించారు . 
ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు  లంక రాఘవులు , సీనియర్ నాయకులు  బండి దత్తాత్రి , జిల్లా కమిటీ సభ్యులు  ఆర్ .మంజుల ,ఆత్రం కిష్టన్న ,బొజ్జ. ఆశన్న.ఎన్ .స్వామి  నాయకులు  లింగాల చిన్నన్న ,కోవే శకుంతల , తదితరులు పాల్గొన్నారు . 
Comments