హైదరాబాద్ : అక్షరతెలంగాణ :
తెలంగాణలోని మందు ప్రియులకు షాకింగ్ న్యూస్. రేపటి నుంచి మూడు రోజులు పాటు వైన్స్ షాపులు, బార్లు క్లోజ్ బంద్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 25న సా.4 గంటల నుంచి 27న సాయంత్రం 4 గంటల వరకు లిక్కర్ షాపులు మూసివేయనున్నారు. మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ లలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా.. నల్గొండ - ఖమ్మం - వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా పోలింగ్ జరిగే ఉమ్మడి ఏడు జిల్లాల పరిధిలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు పోలింగ్ జరగనుండగా, మార్చి 3న ఓట్ల లెక్కింపునకు ఈసీ(EC) ఏర్పాట్లు చేస్తోంది.
హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో మినహా మిగిలిన చోట మద్యం షాపులు యథాతథంగా నడవనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కారణంగా కేవలం కొల్లూరు, ఆర్సీ పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మూడు రోజులపాటు మద్యం షాపులను మూసివేస్తారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులలో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మద్యం విక్రయించినా, మద్యం సరఫరా చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని మద్యం షాపుల నిర్వాహకులను పోలీసులు హెచ్చరించారు.
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు మూసి ఉండనున్నాయి. మద్యం దుకాణాలతో పాటు కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు కూడా బంద్ కానున్నాయి. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా... అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని సగానికిపైగా జిల్లాల్లో ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది.
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కూడా లిక్కర్ షాపులు క్లోజ్ కానున్నాయి.
రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఉమ్మడి ఖమ్మం-వరంగల్- నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎలక్షన్ జరగనుంది. దాదాపు ఎన్నికల ప్రచారం కూడా పూర్తి కావొచ్చింది. ఫిబ్రవరి 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉమ్మడి ఏడు జిల్లాల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.కల్లు కంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా క్లోజ్ అవుతాయి. ఇక రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న కొన్ని గ్రామాల్లో కూడా ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది. ఈ గ్రామాలు... ఆయా జిల్లాల పరిధిలో ఉన్నప్పటికీ కమిషనరేట్ పరిధి నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి కూడా అదే రోజు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Comments