శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ అడుగుజాడల్లో నడవాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా,ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా.

Madupa Santhosh CEO
శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్  అడుగుజాడల్లో నడవాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా,ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా.
అదిలాబాద్ : అక్షరతెలంగాణ :
సేవలాల్ జీవితచరిత్ర ప్రతి ఒక్కరికి అచరణీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం రాంలీలా మైదానంలో సంత్  శ్రీ సేవాలాల్ మహారాజ్  286 వ జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పీఓ తో కలిసి ముఖ్య అథితి గా హాజరై  బోగ్ బండార్  నిర్వహించారు.  
ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్, బంజారా నృత్యం చేశారు .

సాంప్రదాయ దుస్తులలో మహిళలు, యువతులతో  కలిసి ఐటీడీఏ పీఓ సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేయడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. 
ఈ కార్యక్రమంలో బంజార సేవ సంఘం జాతీయ అధ్యక్షుడు అమర్ సింగ్ తిలవత్, ఉత్సవ కమిటి అధ్యక్షుడు రాథోడ్ భీంరావ్, గజానంద్, పవన్నాయక్, జాదవ్ బలిరాం, అదే మనజీ, శివలాల్ నాయక్, సురేష్ రాథోడ్ తదితరులున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ సమాజంలో ప్రతి మనిషి సమానమని ఏండ్ల క్రితమే సంత్ సేవాలాల్ తెలిపారన్నారు. సేవ గుణంతో అందరిని అక్కున చేర్చుకున్న మహానీయుడని కొనియాడారు. ఆయన జీవితచరిత్రను నేటి తరం వారు తెలుసుకుంటు కమ్యూనిటికి సంబంధం లేకుండా సేవ చేస్తే సమాజంలో ఉన్న కష్టాలు తొలుగుతాయన్నారు. ఆయన చూపిన మార్గం ద్వారా రాజ్యాంగంలో పలు ఆర్టికల్స్ ఉన్నాయని, స్వతంత్ర్యం కూడా అహింస మార్గం ద్వారానే సిద్దించిందన్నారు. సేవాలాల్ సుక్తులను అన్ని వర్గాల వారు అచరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.
ఐటిడిఎ పిఓ మాట్లాడుతూ 286 వ శ్రీ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.
సంత్ సేవాలాల్  మహారాజ్ ఆశయాలను, వారి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని జీవితం లో భారత పౌరులుగా ఉన్నత స్థాయికి ఎదగాలని,  ముఖ్యంగా ఆర్థికంగా ఎదగాలంటే ఎటువంటి చెడు వ్యసనాలకు గురికాకుండా  మంచి మార్గంలో నడవాలని అన్నారు. సంత్ సేవాలాల్ యావత్  జాతికి కూడా ఆయన మార్గదర్శకమని అన్నారు. ముఖ్యంగా  పేద స్థితి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలంటే  తర తరాలు మార్చేది చదువు ఒక్కటే  అని జీవితంలో మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి  నలుగురికీ ఆదర్శప్రాయంగా నిలవాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆన్నారు.
Comments