అదిలాబాద్ : అక్షరతెలంగాణ :
-బెల పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ.
-రికార్డుల నిర్వహణ, పోలీస్ స్టేషన్ పరిశుభ్రత పాటించాలి
- అక్రమ రవాణా ను పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలి.సత్నాల ప్రాజెక్టును పరిశీలించిన జిల్లా ఎస్పీ
అక్రమ రవాణాలను పూర్తిగా అడ్డుకట్ట వేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. సోమవారం బేల మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో పరిశీలించిన జిల్లా ఎస్పీ మొదటగా ఎస్సై దివ్యభారతి సిబ్బందితో కలిసి స్వాగతం పలికారు . పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఒక మొక్కను నాటారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న వాహనాలను పరిశీలించి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుదారుల ఫిర్యాదులపై దర్యాప్తు జరిపి తగిన న్యాయం చేకూరే విధంగా కృషి చేయాలి. పోలీస్ స్టేషన్ మహారాష్ట్ర తో సరిహద్దు కలిగిన ఉన్నందున అశాంతిని కార్యకలాపాలు చోటు చేసుకోకుండా పర్యవేక్షించాలి. మండల కేంద్రంలో ప్రజలు సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహించాలి. అక్రమంగా రవాణా జరిగే వాటిని పూర్తిగా అడ్డుకట్ట వేయాలి. పోలీస్ స్టేషన్లో సిబ్బంది ప్రతి ఒక్కరికి అన్ని రకాల విధులను కేటాయిస్తూ నిష్ణాతులను చేయాలని సూచించారు. రౌడీ షీటర్లు ఓపెన్ చేసి వారిని నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, సిఐలు కే ఫణిధర్, డి సాయినాథ్, ఎస్సైలు దివ్యభారతి, ముజాహిద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments