వేసవి వడగాల్పులు (Heatwaves) నష్టాల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు- కలెక్టర్ రాజర్షి షా

Madupa Santhosh CEO
వేసవి వడగాల్పులు  (Heatwaves) నష్టాల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు- కలెక్టర్ రాజర్షి షా అదిలాబాద్ : అక్షరతెలంగాణ : 
డిజాస్టర్ మేనేజ్ మెంట్  వేసవిలో హీట్ వేవ్ 2025  పై సమ్మర్ యాక్షన్ ప్లాన్  కార్యాచరణ ప్రణాళిక  సిద్ధం చేయుటకు  సంబంధిత ఆయా శాఖల జిల్లా అధికారులతో జిల్లా పాలనాధికారి రాజర్షి షా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వేసవి వడగాల్పులు  (Heatwaves) నష్టాల నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని , వేసవి కాలంలో వడగాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు.
ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని రోజురోజుకి భానుడి ప్రతాపం పెరుగుతున్న సందర్భంగా మానవ, జంతవుల జీవితాల పై ప్రభావం  చూపే అవకాశం ఉన్నందున  ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలన్నారు. వేసవి కాలం  ఈ నాలుగు నెలలు అప్రమత్తంగా ఉంటూ  ఆశా కార్యకర్తల నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరి దగ్గర అవసరమైన మేర ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు, ఆవసరమైన మందులు అందుబాటులో ఉండాలని  ఆన్నారు.
మధ్యహ్నం 12.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు ప్రజలు ఎవరూ కూడ బయటకు రావద్దని, అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని సూచించారు .బయటకు వెళితే గొడుగు, తల పై టోపీ పెట్టుకోవాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మున్సిపల్, పంచాయితి శాఖ ల ద్వారా ప్రతి కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆన్నారు.
వడ గాల్పుల వల్ల వచ్చే ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల ను వివరిస్తూ ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 
సమ్మర్ హీట్ వేవ్ నిర్వహణ కోసం జిల్లా, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలలో తాగునీటి సరఫరాకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహించాలని , ఉపాధి హామీ పనులకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్, అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, ఆర్ డి వో వినోద్ కుమార్, విద్యాశాఖ అధికారి ప్రణీత, డి.ఎం.హెచ్.ఓ. నరేందర్,  డి ఆర్ డి వో, డి పి వో,  రవాణా, విద్యుత్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి , జిల్లా పౌర సంబంధాల అధికారిణి, పరిశ్రమ శాఖ, లేబర్, డి డబ్లు వో, ఇరిగేషన్, , ఫైర్ ఆఫీసర్  , పర్యాటకశాఖ, ఆర్ డబ్లు ఎస్, మిషన్ భగీరథ, దేవాదాయ శాఖ, మున్సిపల్ కమిషనర్, ఉపాధి , మత్స్యశాఖ, ఆర్టీసీ,  సీ పీ వో, శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
వడగాల్పులు, ఎండతీవ్రత, తీసుకోవలసిన జాగ్రత్తలు పై విస్తృత ప్రచారం గావించాలని ఆన్నారు.
Comments