సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన : జిల్లా కలెక్టర్ రాజర్షి షా

Madupa Santhosh CEO


ADB: సమ్మర్ స్పోర్ట్స్  క్యాంప్ పోస్టర్ ను ఆవిష్కరించిన: జిల్లా కలెక్టర్ రాజర్షి షాఅదిలాబాద్ : అక్షరతెలంగాణ 
సమ్మర్ క్యాంప్ శిక్షణ కార్యక్రమం లో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా కలెక్టరేట్ ఛాంబర్ లో  వేసవి శిక్షణ శిబిరం పోస్టర్ ను ఆవిష్కరించారు 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు  ఆదిలాబాద్ జిల్లా యువజన,  క్రీడల శాఖ  ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలో  వచ్చే నెల మే 1 నుండి మే 31, 2025వరకు 6 నుండి 14 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన బాలబాలికలకు , యువతకు వివిధ క్రీడలలో వేసవి క్రీడా శిక్షణ శిభిరాల ను  నిర్వహించుటం జరుగుతుందన్నారు.

మే 1 నుండి 31 వరకు ప్రతి రోజు ఉదయం 6.00గంటల నుండి 8.00గంటల వరకు ,  సాయంత్రం 5.00 గంటల నుండి 7.00గంటల వరకు ఆయా వివిధ రకాల క్రీడలలో నిర్వాహకులు శిక్షణ ఇస్తారున్నారు  
ఈ సందర్భంగా క్రీడా సామాగ్రిని కలెక్టర్ శిక్షణ నిర్వాహకులకు అందించారు 
క్రీడా శిభిరాల నిర్వహాకులు,శిక్షకులు వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకొని తమ తమ శిక్షణ శిభిరము వద్ద తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. తాగు నీటి సౌకర్యాన్ని కల్పించి, ఓ.ఆర్.యస్., ప్యాకెట్లు 
అందుబాటులో ఉంచాలని తెలిపారు.  వేసవి సెలవుల్లో పిల్లలు తమ సమయాన్ని వృదాచేయకుండా శిక్షణ శిభిరాలకు హాజరై వారి ప్రతిభను వెలికితీసి సానబెట్టెందుకే రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శిభిరాలను నిర్వహిస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను శిభిరాలకు పంపి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆసక్తి గల వారు గూగుల్ ఫాం ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు 
ఈ కార్యక్రమం లో డి వై ఎస్ ఓ  వెంకటేశ్వర్లు, ఇంటర్మీడియెట్ గణేష్, పార్థసారథి, డీఈఓ శ్రీనివాస్ కొచ్ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
Comments