Adilabad: అక్షరతెలంగాణ:
- వీడియో కెమెరాలు,డ్రోన్ కెమెరాలతో, ప్రత్యేక సిసిటీవీ లతో పర్యవేక్షణ.
- సెక్టర్ ల వారిగా విభజించి బందోబస్తు నిర్వహణ.
అదిలాబాద్ పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి బందోబస్తు ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్. పట్టణంలో 300 మంది సిబ్బందితో భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. స్థానిక సెంట్రల్ గార్డెన్స్ నందు బందోబస్తు సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటుచేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. హనుమాన్ ర్యాలీ సందర్భంగా ప్రత్యేకంగా వీడియో కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేసి బందోబస్తు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో సిబ్బందిని సెక్టర్ ల వారిగా విభజించి బందోబస్తు ప్రక్రియను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బందోబస్తు లో ముఖ్యంగా శోభాయాత్ర సంచరించి దారి పొడవున ఉన్న భవనాలపై రూఫ్ టాప్ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ర్యాలీ జరుగు ప్రదేశాలలో ట్రాఫిక్ డైవర్షన్ ఏర్పాటు చేసినట్లు పట్టణంలోని అంతర్గత రోడ్లను వినియోగించుకోవాలని తెలిపారు. బందోబస్తు ప్రక్రియ కొనసాగుతుందని ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో పండుగను నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీ బి సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, సిహెచ్ నాగేందర్, రిజర్వ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments