జొన్నల విక్రయ కేంద్రం మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభం :

Madupa Santhosh CEO
  ADB : ' జోన్నల విక్రయ కేంద్రం ' సీతక్క చేతుల మీదుగా ప్రారంభం
అదిలాబాద్ : అక్షరతెలంగాణ 
ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ధనసరి సీతక్క ప్రారంభించారు. 
 జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపి గెడం నగేష్, ఎమ్మెల్సీ దండే విట్టల్, డిసిసిబి చైర్మన్ అడ్డి భోజరెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ లు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారుప్రస్తుత నిబంధనల ప్రకారం ఎకరాకి ఒక్కో రైతు నుంచి 8.65 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉండగా, రైతుల మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల విజ్ఞప్తి మేరకు ఆ పరిమితిని ఎకరాంకు 14 క్వింటాళ్లకు ప్రజాప్రభుత్వం పెంచడం జరిగింది అని, ఆదిలాబాదు లో ఎక్కువగా జోన్న సాగు చేస్తున్న రైతులకు ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తుంది అని ఎవరు అధైర్య పడద్దు అని మంత్రి సీతక్క చెప్పారు. రైతుల కొనుగోళ్లలో అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.అలాగే పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మరియు ఇచ్చోడ లోని జిల్లా పరిషత్ పాఠశాల లలో దివ్యాంగులకు ఉచిత ట్రైసైకిల్స్ పంపిణి చేసారు. దనోరా బి లో వంతెన పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.  
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు వేణుగోపాలచారి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్, బోథ్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆడే గజేందర్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, తలమడుగు మాజీ జడ్పి టిసి గోక గణేష్ రెడ్డి, మల్లెపూల నర్సయ్య, పసుల చంటి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రఫుల్ చందర్ రెడ్డి, మండల అధ్యక్షులు షేక్ ఇమామ్, నారాయణ రెడ్డి, ఆడే వసంత్ రావ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు వేముల, సీనియర్ నాయకులు నలిమేల నవీన్ రెడ్డి, ఫెరోజ్, సముల్లాఖాన్, ఆఫ్సర్, రహీం ఖాన్, వాసిం రంజాని తదితరులు పాల్గొన్నారు.
Comments