న్యూస్ డెస్క్: అక్షరతెలంగాణ
భరత దేశంలో భరత ప్రభుత్వం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగానే ముంబై (Mumbai) - అహ్మదాబాద్ (Ahmedabad) హైస్పీడ్ రైల్ కారిడార్ శరవేగంగా రూపుదిద్దుకుటోంది. ఒకవేళ ఆ ట్రాక్ పూర్తయితే దేశంలో ముంబై - అహ్మదాబాద్ రూట్ తొలి హైస్పీడ్ రైల్వే కారిడార్‌గా నిలవనుంది. అయితే, ఆ ట్రాక్‌పై ట్రైన్ గరిష్ట వేగం గంటకు 320 కి.మీగా ఉండనుంది.
బుల్లెట్ ట్రైన్‌గా పిలిచే ఈ రైలు వ్యవస్థను భారత రైల్వే అనుబంధ సంస్థ నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీ) అభివృద్ధి చేస్తోంది. ముంబై-అహ్మదాబాద్ మార్గంలో పనులు పూర్తయిన వెంటనే హై టెంపరేచర్, డ్రైవింగ్ పరిస్థితులపై సమాచారాన్ని సేకరించేందుకు బుల్లెట్ ట్రైన్లను ట్రయల్ రన్ (Trial Run) చేయనున్నారు.
ఈ క్రమంలోనే ఇండియా (India)తో జపాన్ కు ఉన్న స్నేహ సంబంధాల నేపథ్యంలో ఆ దేశం ఇండియాకు రెండు బుల్లెట్ ట్రైన్లను గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. భారత్‌లో బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌కు బిగ్ బూస్ట్ ఇచ్చేలా మిత్ర దేశం జపాన్ (Japan) ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.
గంటకు ఏకంగా 320 కి.మీటర్ల వేగంతో దూసుకెళ్లే షింకన్ సెన్ E5, E3 (Shinkansen E5, E3) సిరీస్ బుల్లెట్ ట్రైన్లు త్వరలోనే భారత్‌కు రానున్నాయి. అయితే, ట్రైన్లనే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్‌పై ట్రయల్ రన్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. కానీ, అధికారికంగా బుల్లెట్ ట్రైన్లు 2026లో ప్రయాణికుల అందుబాటులోకి వస్తాయని ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీ (NHSRC) ఇప్పటికే ప్రకటించింది.
Comments